Share:
Home Building Guide
Our Products
Useful Tools
Product
UltraTech Building Products
Waterproofing Systems
Crack Filler
Style Epoxy Grout
Tile & Marble Fitting System
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
ఇటుకలు కాంక్రీటు, ఇసుక, సున్నం లేదా మట్టితో తయారు చేయబడిన ఒక రకమైన నిర్మాణ సామగ్రి. వాటిని సాధారణంగా గోడలు, కాలిబాటలు మరియు ఇతర రకాల నిర్మాణాలను నిర్మించడానికి ఉపయోగిస్తారు. ఇటుకలను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలూ, అలాగే వాటికి ఉద్దేశింపబడిన వినియోగాన్ని బట్టి వివిధ ఆకారాలూ, రకాలుగా ఉత్పత్తి చేయవచ్చు. ఇది వాటి దృఢత్వం, బలం, అగ్ని నిరోధకత కారణంగా, అవి ప్రసిద్ధ నిర్మాణ సామగ్రిగా ఉంటాయి.
వివిధ రకాల ఇటుకలు ఇక్కడ ఉన్నాయి:
తడి మట్టిని గడ్డి లేదా ఇతర ఫైబర్‌లతో కలిపి, ఎండలో ఆరబెట్టడం ద్వారా వీటిని తయారు చేస్తారు. ఎండలో ఎండబెట్టిన ఇటుకలు, కాల్చిన ఇటుకల వలె బలంగానూ మన్నికగానూ ఉండవు. కానీ అవి ఉత్పత్తి చేయడం చౌక. అందువల్ల వాటిని సాధారణంగా తాత్కాలిక నిర్మాణాలకు ఉపయోగిస్తారు.
ఈ ఇటుకలు బలమైనవి, మన్నికైనవి. ఇవి వివిధ పరిమాణాలు, ఆకారాలు, రంగుల్లో ఉంటాయి. తడి బంకమట్టిని అచ్చు వేసి, అధిక ఉష్ణోగ్రతల వద్ద బట్టీలో కాల్చడం ద్వారా వీటిని తయారు చేస్తారు. కాలిన బంకమట్టి ఇటుకల క్రింద వర్గీకరించబడిన 4 రకాల వైవిధ్యభరితమైన ఇటుకలు, కాల్చిన మట్టి ఇటుకలుగా వర్గీకరించబడి ముఖ్యంగా మట్టి సమృద్ధిగా ఉన్న ప్రాంతాలలో నిర్మాణ ప్రయోజనాల కోసం విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. వాటి వివిధ రకాల్లో కొన్ని ఇక్కడ ఉన్నాయి:
ఇవి అధిక నాణ్యత కలిగి ఉంటాయి మరియు పరిమాణం, ఆకారం మరియు రంగులో ఏకరీతిగా ఉంటాయి. అవి పదునైన అంచులను కలిగి ఉంటాయి, పగుళ్లు మరియు ఇతర లోపాలు లేకుండా ఉంటాయి. అలాగే ఇవి కొట్టినప్పుడు స్పష్టమైన రింగింగ్ ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. ఫస్ట్-క్లాస్ ఇటుకలను సాధారణంగా బరువులు మోసే నిర్మాణాలకూ, కనిపించే గోడలకు ఉపయోగిస్తారు.
ఇవి ఫస్ట్-క్లాస్ ఇటుకలను పోలి ఉంటాయి కానీ సక్రమంగా లేని ఆకారాలు, పరిమాణాలు లేదా రంగులు వంటి చిన్న లోపాలు ఉండవచ్చు. అవి ఇప్పటికీ బరువు మోసే గోడలకు అనుకూలంగా ఉంటాయి కానీ ఎక్స్‌పోజ్ అయిన గోడలకు ఉపయోగించబడవు.
ఇవి ఆకారం, పరిమాణం మరియు రంగులో చాలా క్రమరహితంగా ఉంటాయి మరియు గణనీయమైన పగుళ్లు, వంకరలు, ఇతర లోపాలను కలిగి ఉంటాయి. ఇవి బరువు తట్టుకోవలసిన నిర్మాణాలకు తగినవి కావు, తరచుగా తోట గోడలు లేదా తోటపని వంటి నిర్మాణేతర ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగిస్తారు.
ఇవి ఎక్కువ కాలినవి లేదా తక్కువ కాలినవి మరియు నాణ్యత లేనివి. పగుళ్లు, వంకరలు మరియు ఇతర లోపాలను కలిగి ఉన్నందున అవి ఏవైనా నిర్మాణ ప్రయోజనాల కోసం సరిపోవు.
ఇవి ఫ్లై యాష్ (బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుండి వచ్చే వ్యర్థ ఉత్పత్తి), సిమెంట్ మరియు నీటిని కలిపి, ఆపై మిశ్రమాన్ని అచ్చులుగా కుదించి వీటిని తయారు చేస్తారు. సాంప్రదాయబద్ధమైన మట్టి ఇటుకలకంటే ఇవి ఖర్చు తక్కువతో కూడుకున్నవీ, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయం. వీటిని సాధారణంగా బరువు మోసే నిర్మాణాలకు ఉపయోగిస్తారు.
వీటిని సిమెంట్, ఇసుక, నీరు కలిపి, ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని అచ్చులలో పోసి తయారు చేస్తారు. అవి బలమైనవీ, మన్నికైనవీ, పైగా ఇవి ఫైర్ మరియు అరుగుదల రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి. ఈ ఇటుకలను సాధారణంగా బరువు మోసే నిర్మాణాలకూ, అలాగే పేవింగ్ బ్లాక్‌లుగా ఉపయోగిస్తారు.
ఇవి ప్రత్యేకంగా నిర్మాణాల్లో ఉపయోగించడం కోసం డిజైన్ చేయబడ్డాయి. ఇవి అధిక-నాణ్యత గల బంకమట్టి నుండి తయారవుతాయి. ఇవి అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చబడతాయి. దీంతో ఇవి బలంగానూ, మందంగానూ ఉండి, నీటి నిరోధకతత, రసాయన నిరోధకతని కలిగి ఉంటాయి. ఈ రకమైన ఇటుకలను సాధారణంగా ఇటుకలు భారీ బరువులు మోయాల్సి ఉన్న చోటా లేదా నీటి నిరోధకత అవసరమయ్యే ప్రదేశాలలోనూ ఉపయోగిస్తారు.
ఇవి ఇసుక మరియు సున్నంతో తయారు చేయబడతాయి. ఇవి బాగా బలంగానూ, మన్నికగానూ ఉంటాయి. ఇవి అగ్ని నిరోధకత (ఫైర్ రెసిస్టెన్స్) కలిగి ఉంటాయి. ఇవి తేలికగా ఉండి, మంచి ఇన్సులేషన్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి ఎత్తైన భవనాలలో లేదా థర్మల్ ఇన్సులేషన్ ముఖ్యమైన ప్రదేశాలలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి.
ఈ రకమైన ఇటుకలు ప్లాస్టిక్ సీసాలు, కాగితం మరియు ఇతర వ్యర్థ ఉత్పత్తుల వంటి రీసైకిల్ పదార్థాల నుండి తయారు చేయబడతాయి. ఇవి సాంప్రదాయబద్ధమైన ఇటుకలకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయం. వీటికి ఉన్న స్థిరత్వం వల్ల ఇవి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇవి సాధారణంగా తోట గోడలు, లాండ్‌స్కేపింగ్ లేదా ఆకర్షణీయంగా అలంకరించడం (డెకరేటివ్ ఫీచర్ల) వంటి నిర్మాణేతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
ఇటుకలను వాటి పరిమాణం, రంగు, ఆకృతి, కొట్టి చూసినపుడు దాన్నించి వచ్చే ధ్వనిని బట్టి గుర్తించవచ్చు. ఇటుకలను గుర్తించడంలో మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని దశలు ఉన్నాయి:
ఇటుకలు వివిధ పరిమాణాలలో వస్తాయి, అయితే అత్యంత సాధారణ పరిమాణం 8.5 అంగుళాలు, 4.25 అంగుళాలు, 2.75 అంగుళాలు (215 మిమీ x 102.5 మిమీ x 65 మిమీ). మీరు దాని పరిమాణాన్ని నిర్ణయించడానికి ఇటుకను కొలవవచ్చు.
ఇటుకలు ఎరుపు, గోధుమ, బూడిద, క్రీమ్ రంగు, ఇలా వివిధ రంగులలో రావచ్చు. ఇటుకను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు, కాల్పుల ప్రక్రియ, ఉత్పత్తిలో ఉపయోగించే అదనపు పదార్థాల వల్ల రంగు మారవచ్చు.
ఇటుకలు వాటి ఉద్దేశించిన వినియోగాన్ని బట్టి వివిధ ఉపరితలాలను కలిగి ఉంటాయి. బరువు మోసే గోడలకు ఉపయోగించే ఇటుకలు మృదువైన ఉపరితలం, పదునైన అంచులను కలిగి ఉంటాయి, అలంకరణ ప్రయోజనాల కోసం ఉపయోగించే ఇటుకలు కఠినమైన ఆకృతిని లేదా నమూనానీ కలిగి ఉండే అవకాశం ఉంది.
వేలిని తిప్పి గోటితో కొట్టి చూసినపుడు, మంచి నాణ్యత గల ఇటుక అయితే స్పష్టమైన రింగింగ్ ధ్వనిని ఉత్పత్తి చేయాలి. ఇటుక ఒక నిస్తేజమైన చప్పుడును ఉత్పత్తి చేసిందంటే, అది తక్కువ నాణ్యత కలిగినదైనా లేదా దెబ్బతిన్నదైనా కావచ్చు.
ఇటుకల గట్టిదనం వాటి అరుగుదల, పగుళ్లు తట్టుకోగల సామర్థ్యాన్నిబట్టి నిర్ణయించబడుతుంది. బాగా గట్టిగా కలిగిన ఇటుకలు మరింత మన్నికైనవీ, దీర్ఘకాలం మన్నిక కలిగేవీ అయి ఉంటాయి.
సంపీడనాన్ని తట్టుకోగల ఇటుకల సామర్థ్యం ఇది. గోడ బరువుని మోసే సామర్థ్యాన్ని నిర్ణయించడానికి ఇది ఒక కీలకమైన అంశం. ఇటుకల కంప్రెసివ్ స్ట్రెంగ్త్ టెస్ట్ ని ఉపయోగించి వాటి సంపీడన బలం పరీక్షించబడుతుంది
శోషణ అనేది నీటిని గ్రహించే ఇటుకల సామర్థ్యాన్ని సూచిస్తుంది. తక్కువ శోషణ రేటు కలిగిన ఇటుకలు నిర్మాణ అవసరాలకు మరింత అనుకూలంగా ఉంటాయి, ఎందుకంటే అవి నీటికి గురైనప్పుడు పగుళ్లు లేదా బలహీనపడే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఇటుకల యొక్క ఉష్ణ వాహకత వేడిని నిర్వహించే సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. తక్కువ ఉష్ణ వాహకత కలిగిన ఇటుకలు ఇన్సులేషన్ ప్రయోజనాల కోసం బాగా సరిపోతాయి ఎందుకంటే అవి భవనం లోపల స్థిరమైన ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడతాయి.
కరిగే లవణాలు ఉండటం వల్ల ఇటుకల ఉపరితలంపై తెల్లటి నిక్షేపాలు కనిపించడాన్ని ఎఫ్లోరోసెన్స్ అంటారు. ఇది రంగు పాలిపోవడానికి కారణమవుతుంది మరియు ఇటుకను బలహీనపరుస్తుంది.
ఆల్కలీ రెసిస్టెన్స్ అంటే సిమెంట్ వంటి ఆల్కలీన్ పదార్థాల ప్రభావాలను నిరోధించే ఇటుకల సామర్ధ్యం. అధిక క్షార నిరోధకత కలిగిన ఇటుకలు ఈ పదార్థాలకు గురైనప్పుడు క్షీణించే లేదా పాడైపోయే అవకాశం తక్కువ.
మొత్తంమీద, ఇటుకల లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, అవి వాటి ఉద్దేశించిన వినియోగానికి అనుకూలంగా ఉన్నాయని మరియు కాలక్రమేణా బాగా పని చేస్తాయి. సంపీడన బలం పరీక్ష వంటి ఇటుకలను పరీక్షించడం, వాటి నాణ్యత మరియు మన్నికను గుర్తించడంలో సహాయపడుతుంది.
ఇటుకలతో నిర్మించడం శతాబ్దాలుగా ప్రసిద్ధ నిర్మాణ పద్ధతి. ఇటుకలు వాటి బలం, మన్నిక మరియు అగ్ని మరియు వాతావరణ నిరోధకతకు ప్రసిద్ధి చెందాయి. ఇటుకలను పరీక్షించడం ద్వారా, బిల్డర్లు తాము నిర్మించే నిర్మాణాలు సురక్షితమైనవి, మన్నికైనవి మరియు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవచ్చు. నీటి శోషణ, సంపీడన బలం మరియు మరిన్నిఇటుకలను పరీక్షించడానికి ఉపయోగించే వివిధ పద్ధతులు ఈ వీడియోలో మీరు కనుగొనవచ్చు. ఈ పరీక్షలు వివిధ నిర్మాణ ప్రయోజనాల కోసం ఇటుకల అనుకూలతను గుర్తించడంలో సహాయపడతాయి మరియు నిర్మాణ ప్రక్రియలో తీవ్ర సమస్యలకు దారి తీసే తప్పులను నిరోధించవచ్చు.