Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

అవలోకనం

కస్టమర్లకు పూర్తి స్థిరమైన పరిష్కారాలను అందించే ప్రయత్నంలో మరియు 360 డిగ్రీలలో నిరంతరంగా నిర్మాణ సామగ్రి అందించడానికి, అల్ట్రాటెక్ సిమెంట్ చే స్థాపించబడిందే అల్ట్రాటెక్ సిమెంట్ బిల్డింగ్ ప్రోడక్స్ డివిజన్. నిర్మాణ మరియు మౌలిక సదుపాయాల పరిశ్రమ కోసం సాంకేతికంగా రీ- ఇంజనిరింగ్ (పునర్నిర్మించిన) చేసిన ఉత్పత్తులను తయారు చేస్తుంది మరియు మార్కెట్ చేస్తుంది.

Image

నేడు నిర్మాణ పరిశ్రమ సాంప్రదాయిక ఉత్పత్తులను మరియు ఫాస్ట్ ట్రాక్ నిర్మాణాలకు సంప్రదాయ పద్దతిని భర్తీ చేయగల ఉత్పత్తులను డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌ను తీర్చడానికి, ఇది ఎండ్-టు-ఎండ్ పరిష్కారాల పూర్తి పోర్ట్ ఫోలియోను అందిస్తుంది, నిర్మాణం యొక్క మొత్తం అవసరాలను కవర్ చేస్తుంది.

 

ఉత్పత్తి పరిధిలో టైల్స్ అడ్హసీవ్స్ (TILEFIXO-CT, TILEFIXO-VT, TILEFIXO-NT, మరియు TILEFIXO-YT), మరమ్మతు ఉత్పత్తులు (MICROKRETE మరియు BASEKRETE), వాటర్‌ఫ్రూఫింగ్ ఉత్పత్తులు (SEAL& DRY, FLEX ,HI-FLEX and MIKROFILL) పారిశ్రామిక గ్రౌట్ NS1, NS2, మరియు NS3), ప్లాస్టర్లు (READIPLAST, SUPER STUCCO), తాపీపని ఉత్పత్తులు (FIXOBLOCK), తేలికపాటి బరువు AAC( ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్) (XTRALITE) ఉంటాయి



ఉత్పత్తి పరిధి



ఉత్పత్తి పరిధి



అల్ట్రాటెక్ టిలెఫిక్సో (TILEFIXO) అనేది , గోడలు మరియు అంతస్తులపై సహజ రాళ్ళు టైల్స్ ని అతికించడానికి అభివృద్ధి చేసిన అధిక నాణ్యత కలిగిన టైల్ అడ్హెసివ్. ఇది సిమెంట్ ఆధారిత అధిక పనితీరు బలం గల పాలిమర్ అడ్హెసివ్, అంతర్గత మరియు బాహ్య, సన్నని బెడ్ అప్లికేషన్లకు. వేర్వేరు TILEFIXO యొక్క నాలుగు రకాలు ఉన్నాయి. 


 

సుపీరియర్ జనరల్ పర్పస్ సిమెంటిషియస్ టైల్ అడ్హెసివ్ కాంక్రీట్ ఉపరితలంపై మాస్ ఫ్లోరింగ్ అవసరాలకు మరియు చిన్న నుండి మధ్య తరహా అప్లికేషన్లకు సిఫార్సు చేయబడ్డాయి.

 

విట్రిఫైడ్ యొక్క పెద్ద ఫార్మాట్ పరిధి కోసం ప్రీమియం పాలిమర్ కలిగిన టైల్ అడ్హెసివ్ ,కాంక్రీట్ ఉపరితలంపై మరియు గోడ అప్లికేషన్ కోసం పోర్సెలిన్ టైల్స్ మరియు సిరామిక్, విట్రిఫైడ్, మొజాయిక్ మరియు నేచురల్ స్టోన్ వంటి ఉపరితలాలపై టైల్ ఆన్ టైల్ అప్లికేషన్ కోసం ఉన్నాయి.

 

రకరకాల గ్రానైట్ మరియు ఇతర రాళ్ళు వంటి పెద్ద పరిమాణంలో ఉన్న సహజ రాళ్లను నిలువుగా పెట్టడం కోసం, కాంక్రీట్ మరియు ప్లాస్టర్డ్ ఉపరితలంపై నిలువు మరియు క్షితిజ సమాంతర అప్లికోసన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన టైల్ అడ్హసివ్

 

కాంక్రీట్ మరియు స్టోన్ ఫ్లోరింగ్ పై ఉపరితలం కోసం, ఇటాలియన్ మరియు ఇండియన్ మార్బుల్ రాయి కోసం ప్రీమియం వైట్ సిమెంట్ ఆధారిత పాలిమర్ మోడిఫైడ్ సిమెంటిషియస్ అడ్హెసివ్స్.


డి స్ట్రెస్డ్ కాలమ్స్, బీమ్ లు బలోపేతం చేయడం , కొరకు మరియు అత్యంత పోర్స్ రూఫ్ మీద రిపేర్ కొరకు మోర్టార్ మరియు మైక్రో కాంక్రీట్ అందుబాటులో ఉన్నాయి .ఇవి సుసంపన్నమైన పాలిమర్ మరియు అధిక సామర్థ్యం కల్గి ఉంటాయి.


 

అల్ట్రాటెక్ మైక్రోక్రీట్ అనేది పాలిమర్ సుసంపన్నమైన సిమెంట్ ఆధారిత అధిక పనితీరు, బలం గల మైక్రో కాంక్రీట్, కాలమ్స్, బీమ్స్ మరియు కాంక్రీట్ స్లాబ్ మరమ్మతుల మరియు జాకెటింగ్ అప్లికేషన్ల కోసం అధిక నాణ్యత గల మైక్రోక్రీట్ ఉపయోగిస్తారు. వేగవంతమైన మరియు మన్నికైన మరమ్మతులకు IDI అనువైనది. ప్రత్యేక పాలిమర్లు, మరియు ఎంచుకున్న ఫిల్లర్లను ఉపయోగించడం ద్వారా ఇది అభివృద్ధి చేయబడింది. అధిక వాల్యూమ్ అప్లికేషన్లకు 8 MM పరిమాణం వరకు చిన్న కంకరలను చేర్చడం. జరుగుతుంది మైక్రోక్రీట్ ( MICROKRETE) లో మూడు వేరియంట్లు ఉన్నాయి.

మైక్రోక్రీట్- HS1: 80 MPa బలం కోసం రూపొందించబడింది - మైక్రోక్రీట్ HS2: 60 MPa బలం కోసం రూపొందించబడింది - మైక్రోకీట్ HS3: 40 MPa బలం కోసం రూపొందించబడింది

 

అల్ట్రాటెక్ బేస్‌క్రెట్ అనేది రూపాంతరం చెందిన పాలిమర్.IDI సిమెంట్ ఆధారిత అధిక పనితీరు కలిగిన శక్తివంతమైన మోర్టార్, ఇది బహుళార్ధసాధక అప్లికేషన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అధిక బలాన్ని కోరుకునే బాహ్య మరియు అంతర్గత ప్రాంతాలకు మందమైన ప్లాస్టర్ల కోసం, ఇటుక / GODA KATTUBADI అప్లికేషన్లకి అనుకూలంగా ఉంటుంది. పాత ఉపరితల మరమ్మతుల కోసం దీనిని రూపాంతరం చెందిన పాలిమర్ మరమ్మతు మోర్టార్‌గా కూడా ఉపయోగించవచ్చు. స్విమ్మింగ్ పూల్, వాటర్ ట్యాంక్, ఫౌండేషన్ ప్రాంతాలు మరియు బేస్మెంట్ల లోపల ప్లాస్టరింగ్ చేయడానికి అనువైనది. ప్రత్యేకమైన / పెద్ద పరిమాణపు టైల్స్ ను నిలువు ఉపరితలాలపై ఉంచడానికి, టైల్ అడ్హెసివ్ కింద ప్లాస్టర్ యొక్క అవసరమైన బలాన్ని అందించడానికి టైల్ అడ్హెసివ్ ల కోసం ఇది అండర్లేమెంట్ ప్లాస్టర్ గా కూడా ఉపయోగించవచ్చు.    


ఫ్లోర్ స్క్రీడ్స్ ఇండోర్ మరియు అవుట్డోర్ ప్రదేశాలలో ఫ్లోర్ టైల్స్ క్రింద అండర్లేమెంట్ లా , కాంక్రీట్ రూఫ్ పై అప్లై చేసే నీటినిరోధిత కోటింగ్ పైన మందమైన లేయర్ లా ఉపయోగపడుతుంది . వర్షపు నీరు బయటకు పోవడానికి మందం గల వాలు కోసం ఉపయోగిస్తారు. దీనివల్ల బ్రిక్ బ్యాట్ కోబా (ఇటుకలను పేర్చడం) వాడకాన్నితొలగిస్తుంది,


 

అల్ట్రాటెక్ ఫ్లోర్ క్రెట్ అనేది రూపాంతరం చెందిన పాలిమర్ సిమెంట్ ఆధారిత అధిక పనితీరు కలిగిన శక్తివంతమైన మోర్టార్, ఇది బహుళార్ధసాధక ఫ్లోర్ స్క్రీడ్ అప్లికేషన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. వాటర్ ప్రూఫింగ్ కోటింగ్స్, నివాస భవనాలలో ఫ్లోర్లు, కార్యాలయ భవనాలు, వాణిజ్య ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాలు ,టైల్ అడ్హెసివ్స్, ఎపోక్సీ / పియు (PU) మరియు ప్రత్యేక ఫ్లోరింగ్ వ్యవస్థలకు అండర్లేమెంట్‌గా టెర్రస్ ప్రాంతాలలో ఇది అనుకూలంగా ఉంటుంది.

ఫ్లోర్‌క్రీట్ మూడు వేరియంట్‌లను కలిగి ఉంది, ఫ్లోర్‌క్రీట్ హెచ్‌ఎస్ 1 - M60 రూపకల్పన శక్తితో  ఫ్లోర్‌క్రీట్ HS2 - M40 రూపకల్పన శక్తితో ఫ్లోర్‌క్రీట్ హెచ్‌ఎస్ 3 - M 20 రూపకల్పన శక్తితో- రూపొందించబడ్డాయి.


ఫ్లాట్ రూఫ్ కాంక్రీటు, కిచెన్ బాల్కనీలు, గోపురాలు, వాలైన రూఫ్ లు మరియు బాత్-రూములు, కెనాల్ లైనింగ్స్, స్విమ్మింగ్ పూల్స్, వాటర్ ట్యాంకులు వంటి తడి ప్రాంతాలలో అవసరమైన చోట వినియోగం కోసం సింగిల్ లేదా రెండు కాంపోనెంట్ల గా పాలిమర్ / మోడిఫైడ్ కో పాలిమర్ / యాక్రిలిక్ / ఎస్బిఆర్ రబ్బరు కలయికతో వాటర్ఫ్రూఫింగ్ ఏజెంట్లు ఉన్నాయి.



ప్రీకాస్ట్ ఎలిమెంట్స్‌ జాయినింగ్, అధిక పనితీరు భద్రతా సొరంగాలు మొదలైనటువంటి మెషిన్ ఫౌండేషన్‌లో విస్తృత రకాల అనువర్తనాల కోసం కుచించుకుపోని, సాగేగుణం లేని అధిక పనితీరు గల ఇండస్ట్రియల్ గ్రౌట్స్.


 

బలమైన గదులు మరియు సొరంగాల కోసం అవరోధ పదార్థంగా అధిక తొలి బలం అవసరమయ్యే ఫౌండేషన్ బేస్ ప్లేట్లు, మెషిన్ పునాదులు మరియు బెడ్స్ కోసం100 MPa యొక్క శక్తి రూపకల్పనతో గ్రౌటింగ్ కోసం ఇది సిఫార్సు చేయబడింది

 

ఫౌండేషన్ బేస్ ప్లేట్లు, మెషిన్ ఫౌండేషన్స్ మరియు అధిక బలాన్ని కోరుకునే కాంక్రీట్ బెడ్స్ కోసం 80 MPa రూపకల్పన బలాన్ని గ్రౌటింగ్ చేయడానికి మైక్రో పైల్స్ మరియు పైల్ క్యాప్స్, షీర్ వాల్ బాండ్ బీమ్స్, ప్రీకాస్ట్ ఎలిమెంట్లను ఫిక్సింగ్ మరియు యాంకరింగ్ చేయడానికి, అధిక బలం పేవర్స్ మరియు బ్లాకుల తయారీ కోసం ఇది సిఫార్సు చేయబడింది.

 

మైక్రో పైల్స్ మరియు పైల్ క్యాప్స్, షీర్ వాల్ బాండ్ బీమ్స్, 60 MPa యొక్క డిజైన్ బలంతో గ్రౌటింగ్ చేయడానికి, ప్రీకాస్ట్ ఎలిమెంట్లను ఫిక్సింగ్ మరియు యాంకరింగ్ చేయడానికి,అధిక బలం పేవర్స్ మరియు బ్లాకుల తయారీకి, పట్టాలు, యాంకర్లు, ఫాస్టెనర్లు మొదలైనవి పరిష్కరించడానికి ఇది సిఫార్సు చేయబడింది.

 

పవర్‌గ్రౌట్ పిజిఎం పంపుబుల్ గన్ గ్రేడ్ మోర్టార్ టై రాడ్ రంధ్రాలు / స్లిట్ రంధ్రాలను కాంక్రీటులో మివాన్ షట్టరింగ్ బ్రిక్ తాపీపనితో నింపడానికి మరియు సహజ రాళ్ళలో కూడా దీనిని ఉపయోగించవచ్చు.


అంతర్గత మరియు బాహ్య గోడల కోసం సన్నని మరియు మందపాటి కోటు అప్లికేషన్ కోసం రూపాంతర పాలిమర్ ఉపరితల ఫినిషింగ్ ప్లాస్టర్లు


 

అల్ట్రాటెక్ రెడీప్లాస్ట్ (READIPLAST) అనేది రెడీ మిక్స్ సిమెంట్ ప్లాస్టర్ /అధిక నాణ్యత గల పాలిమర్ మిశ్రమం, ఇది మాన్యువల్ ప్లాస్టరింగ్ అప్లికేషన్ల కోసం బాగా గ్రేడెడ్ ఇసుక మరియు ఫిల్లర్లు ను కల్గి ఉంటుంది. లోపలి మరియు బయటి గోడలపై ప్లాస్టరింగ్ కోసం దీనిని ఉపయోగించవచ్చు. ఇటుక, బ్లాక్, రాతి గోడలతో పాటు కాంక్రీట్ ఉపరితలాలపై కూడా దీనిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. 15 మిమీ వరకు ప్లాస్టరింగ్ గరిష్ట మందంతో బాగా తయారుచేసిన గోడలకు అనువైనది.

 

అల్ట్రాటెక్ సూపర్ STUCCO అనేది రెడీ మిక్స్ సిమెంట్, పాలిమర్ ఆధారిత, అధిక పనితీరు గల ఉపరితల ఫినిషింగ్ మెటీరియల్, సన్నని బెడ్ / కోట్ (పూత) అప్లికేషన్ల కోసం అధిక నాణ్యత గల పాలిమర్ మిశ్రమాలు, గ్రేడెడ్ ఇసుక మరియు ఫిల్లర్లతో కలపబడింది.


AAC బ్లాక్, ఫ్లై యాష్ బ్రిక్స్ మరియు కాంక్రీట్ బ్లాక్స్ కోసం పల్చని బెడ్ జాయింటింగ్ మోర్టార్


 

అల్ట్రాటెక్ ఫిక్సోబ్లాక్ (FIXOBLOCK) అనేది 3 మిమీ పల్చని అప్లికేషన్ల కోసం యోగ్యమైన పల్చని జాయింటింగ్ మోర్టార్. చాలా గట్టిగా అతుక్కునే బలంతో బ్లాకుల మధ్య బలమైన, మన్నికైన బంధాన్ని కలిగించడానికి ఈ మోర్టార్ ప్రత్యేకంగా రూపొందించబడింది.


తాపీపని నిర్మాణం కోసం తక్కువ బరువు వుండే బ్లాక్


 

అల్ట్రాటెక్ ఎక్స్‌ట్రాలైట్ తక్కువ బరువు కలిగిన ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్. ఇది సున్నం, సిమెంట్ మరియు ఫ్లైయాష్ ల మిశ్రమం యొక్క చర్య నుండి విడుదలయిన పదార్ధం ద్వారా తయారు చేయబడుతుంది.

Loading....