Share:
Home Building Guide
Our Products
Useful Tools
Product
UltraTech Building Products
Waterproofing Systems
Crack Filler
Style Epoxy Grout
Tile & Marble Fitting System
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
కాంక్రీట్ సెగ్రిగేషన్ అనేది తాజాగా కలిపిన కాంక్రీటులో ఉన్న పదార్ధాల విభజనని సూచిస్తుంది. గురుత్వాకర్షణ కారణంగా బరువైన కంకరలు స్థిరపడినప్పుడు, తేలికైన సిమెంట్ మరియు నీటి మిశ్రమాన్ని పైన వదిలివేసినప్పుడు ఇది జరుగుతుంది. కాంక్రీట్ మిశ్రమం సరిగ్గా కలపబడనప్పుడు లేదా ఎక్కువ నీరు-సిమెంట్ నిష్పత్తిని కలిగి ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలు ఇతర వాటికన్నా ఎక్కువ సిమెంట్ లేదా నీటిని కలిగి ఉన్నప్పుడు కూడా సెగ్రిగేషన్ జరుగుతుంది.
కాంక్రీటులో సంభవించే రెండు రకాల ప్రాథమిక సెగ్రిగేషన్లు ఉన్నాయి:
కాంక్రీట్ మిశ్రమంలోని పెద్ద కంకర సెటిల్ అయిపోయి, అది సిమెంట్ నుంచీ, నీటి మిశ్రమం నుంచీ విడిపోయినప్పుడు, మిశ్రమం ఏకరీతిగా లేకుండా చేసినప్పుడు ఇది జరుగుతుంది. రవాణా సమయంలో గానీ లేదా కాంక్రీటు పోసే సమయంలోనూ సెగ్రిగేషన్ జరగవచ్చు.
మిశ్రమం సమంగా అన్నివైపులా కలవని కారణంగా నీరు మరియు సిమెంట్ విడిపోయినప్పుడు ఈ రకమైన సెగ్రిగేషన్ జరుగుతుంది. ఇది సరైన మిక్సర్లు వాడకపోయినా, తగినంత మిక్సింగ్ సమయం గానీ లేదా నీరు-సిమెంట్ నిష్పత్తి సరైన పాళ్లలో లేకపోవడం వల్ల గానీ సంభవించవచ్చు.
ఈ రెండు రకాల సెగ్రిగేషన్ల వల్లా కూడా మధ్యలో ఏర్పడటం, కాంక్రీటు బలహీనపడటం, నిర్మాణం మన్నిక తగ్గడం వంటి ముఖ్యమైన సమస్యలను కలిగిస్తాయి. సరైన నిర్వహణ, రవాణా, కాంక్రీట్ మిక్స్ ప్లేస్‌మెంట్ ఈ రకమైన సెగ్రిగేషన్ ని నిరోధించడంలో సహాయపడుతుంది.
కాంక్రీటు సెగ్రిగేషన్ ని ప్రభావితం చేసే అనేక కారణాలూ, కారకాలూ ఉన్నాయి.
కాంక్రీట్ మిశ్రమంలోని పదార్ధాల నిష్పత్తి ఒకే రకంగా లేకుంటే, అది సెగ్రిగేషన్ కి దారి తీస్తుంది. ఎక్కువ నీరు-సిమెంట్ నిష్పత్తితో నీటికి గల హెచ్చు బరువు కారణంగా కంకర క్రిందికి దిగిపోవడానికి కారణమవుతుంది.
కాంక్రీటు అంతటా బాగా కలపబడకపోతే, మిశ్రమం కొన్ని ప్రాంతాలలో ఎక్కువగానూ లేదా ప్రాంతాల్లో తక్కువగానూ నిర్దిష్ట పదార్థాలు ఉండవచ్చు, ఇది సెగ్రిగేషన్ కి దారి తీస్తుంది.
కాంక్రీట్ మిశ్రమాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం కూడా సెగ్రిగేషన్ కి కారణమవుతుంది. మీరు కాంక్రీటును మాన్యువల్‌గా మిక్స్ చేస్తే, మిక్సింగ్ ప్రక్రియలో అసమానతలు ఉండవచ్చు, ఇది సెగ్రిగేషన్ కి దారి తీస్తుంది.
కాంక్రీట్ సెగ్రిగేషన్ కి కాంక్రీటు రవాణా బాగా దోహదపడుతుంది. కాంక్రీటును ఎక్కడ వేస్తున్నారా అనేది చాలా ముఖ్యం. కాంక్రీటు ఎత్తు నుండి పోసినా లేదా ఎక్కువ దూరం రవాణా చేయాల్సి ఉన్నా, అది బరువైన కంకరని క్రిందికి తోసేస్తుంది కాబట్టి మిగిలిన మిశ్రమం నుండి అది వేరుపడడానికి కారణమవుతుంది.
కంపనం సాధారణంగా కాంక్రీటు నుండి గాలి పాకెట్‌లను స్థిరీకరించడానికీ, వాటిని తొలగించడానికి ఉపయోగించబడుతుంది, అధిక కంపనం మొత్తం మిశ్రమాన్ని స్థిరపరచడానికీ, మిగిలిన మిశ్రమం నుండి వేరు చేయడానికి కారణమవుతుంది.
కాంక్రీటులో సెగ్రిగేషన్ అనేక ప్రభావాలను కలిగి ఉంటుంది, వీటిలో ఇవి ఉంటాయి:
కాంక్రీటు మిశ్రమం విడిపోయినప్పుడు, అది ఖాళీలు ఏర్పడేందుకు దారితీస్తుంది. ఇది కాంక్రీటులో పారగమ్యతని అంటే చొచ్చుకుపోయే గుణాన్ని పెంచుతుంది. ఇది నీటిని కాంక్రీటులోకి చొచ్చుకుపోయేలా చేస్తుంది, దీంతో సిమెంట్ లోని అదనపు బలాని (రీఇన్‌ఫోర్స్‌మెంట్)కీ కార్బొనేషన్‌కీ తుప్పు పట్టేందుకు దారితీస్తుంది.
సెగ్రిగేషన్ కాంక్రీటులో పగుళ్లు ఏర్పడటానికి కూడా దారి తీస్తుంది, ఇది నిర్మాణం మన్నికనీ, జీవితకాలాన్నీ గణనీయంగా తగ్గిస్తుంది. కంకర సమానంగా పరుచుకోకపోవడం కారణంగా ఈ పగుళ్లు ఏర్పడవచ్చు. ఆ విధంగా బలహీనమైన, నాసిరకమైన బలం కలిగిన నిర్మాణం ఏర్పడవచ్చు.
సెగ్రిగేషన్ కాంక్రీటులో బలహీనమైన ప్రాంతాలు ఏర్పడటానికి కూడా దారి తీస్తుంది, ఫలితంగా మొత్తం బలం తగ్గుతుంది. కంకర స్థిరపడిన ప్రాంతాలలో సిమెంట్ మరియు నీరు కూడా ఎక్కువ సాంద్రత కలిగి ఉండవచ్చు, ఫలితంగా బలహీనమైన కాంక్రీట్ మిశ్రమం ఏర్పడుతుంది. దీనివల్ల నిర్మాణం తక్కువ బరువు మోసే సామర్థ్యం మాత్రమే కలిగి ఉండడానికి కూడా దారి తీస్తుంది.
మొత్తంమీద, కాంక్రీటు సెగ్రిగేషన్ నిర్మాణ సమగ్రతకు తీవ్రమైన పరిణామాలను కలుగజేస్తుంది. కాంక్రీట్ మిశ్రమాన్ని కలపడం, రవాణా చేయడం, దాన్ని వేసే సమయంలో సెగ్రిగేషన్ ని నిరోధించడం చాలా అవసరం.
కాంక్రీటులో సెగ్రిగేషన్ ని నిరోధించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ దశలను అనుసరించడం ద్వారా, కాంక్రీటులో సెగ్రిగేషన్ ని నిరోధించవచ్చు, అంతిమ ఉత్పత్తి అధిక నాణ్యత కలిగి మన్నికైనదీ, దీర్ఘకాలం మన్నేదీ అయి ఉండేలా చూసుకోవాలి.
కంకర, సిమెంట్, నీరు మరియు ఇతర మిశ్రమాల నిష్పత్తి ఖచ్చితంగానూ, ఏకరీతిగానూ ఉండాలి. నీరు-సిమెంట్ నిష్పత్తి కలపబడిన కాంక్రీటు రకానికి తగినట్టు ఉండాలి.
అన్ని పదార్థాలు అంతటా ఒకే విధంగా సమంగా పరచబడేలా చూసుకోవడానికి కాంక్రీటుని పైకీ క్రిందకీ బాగా కలిసేలా కలపాలి. తగినంత మిక్సింగ్ సమయం మరియు తగిన పరికరాలు ఉపయోగించాలి.
సెగ్రిగేషన్ ని నిరోధించడానికి రవాణాలోనూ, అలాగే కాంక్రీట్ ని వేసే సమయంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తగిన హ్యాండ్లింగ్ పరికరాలను ఉపయోగించడం మరియు మాన్యువల్ మిక్సింగ్‌ను నివారించడం సెగ్రిగేషన్ ని నిరోధించడంలో సహాయపడుతుంది.
కాంక్రీట్ ప్లేస్‌మెంట్‌లో వైబ్రేషన్ అనేది ఒక ముఖ్యమైన దశ, మరియు ఇది కాంక్రీటును యూనిఫాంగా పరుచుకునేలా చేయడానికీ, అలాగే లోపల చిక్కుకున్న గాలిని తొలగించడానికీ సహాయపడుతుంది. తగినంత వైబ్రేషన్ కూడా కాంక్రీటు ఏకరీతిగా పరుచుకునేలా చూసుకుంటే అది సెగ్రిగేషన్ ని నిరోధించడంలో సహాయపడుతుంది.
ఖాళీలు ఏర్పడకుండా నిరోధించడానికి కాంక్రీటును జాగ్రత్తగా పోయాలి, ఇది సెగ్రిగేషన్ కి దారితీస్తుంది. కాంక్రీటును లేయర్స్ గా వేయాలి, ప్రతి లేయర్ నీ వీలైనంతగా కుదించాలి.
నిర్మాణాలు మరియు అవస్థాపనల నాణ్యత, మన్నిక, భద్రతని ఉండేలా చూసుకోవడానికి కాంక్రీటులో సెగ్రిగేషన్ ని నిరోధించడం చాలా కీలకం. సెగ్రిగేషన్ అనేది పెద్ద కంకర రాళ్ల వల్ల కాంక్రీట్ అంతటా సమానంగా పరుచుకోకుండా పోయి, బలహీన ప్రాంతాలు, పగుళ్లు ఏర్పడతాయి. బరువు మోసే సామర్థ్యం తగ్గడం, తద్వారా నిర్మాణ వైఫల్యానికి దారి తీయడం జరుగుతుంది. అంతేకాకుండా, ఇది పారగమ్యతను పెంచుతుంది, కాంక్రీటును తుప్పు, కార్బొనేషన్ ఇంకా ఇతరత్రా అనేక రకాల నష్టాలకు గురి చేస్తుంది. కాంక్రీటులో సెగ్రిగేషన్ ని నిరోధించడానికి, నిర్మాణ వాతావరణం, భద్రత, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి సరైన విధానాలను అనుసరించడం చాలా అవసరం.