Share:
Home Building Guide
Our Products
Useful Tools
Product
UltraTech Building Products
Waterproofing Systems
Crack Filler
Style Epoxy Grout
Tile & Marble Fitting System
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
ఒక వ్యక్తి తన ఇల్లు కట్టుకునేటప్పుడు సమాధానం చెప్పడానికి ప్రయత్నించే అతి ముఖ్యమైన ప్రశ్నలలో బహుశా ఇది కూడా ఒకటి. పైకప్పు శైలి, కిటికీల నుండి గోడ టెక్స్చర్‌లూ, ఫ్లోరింగ్, ఇలా నిర్‌మాణంలో ప్రతి అంశానికి సంబంధించిన అంతిమ ఫలితం కంటికి ఆహ్లాదకరంగా ఉండేలా రూపొందించబడుతుంది.
అయితే, కొన్నిసార్‌లు ఈ ప్రక్రియలో పరిగణించవలసిన ఆకర్‌షణీయమైన కనిపించాలనే అంశం తప్ప మిగతా విషయాలను జనం మరచిపోతారు. ఉదాహరణకు, టైల్స్ ఎంత జాగ్రత్తగా వేయాలీ, అది మన్నికగా ఉండేలా చూసుకోవడానికి ఎంత సంరక్షణ, శ్రద్ధ అవసరమనే విషయం దృష్టిలో ఉంచుకోవాలి.
సరైన ఇన్‌స్టలేషన్ పద్ధతికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఉత్పత్తులను ఉపయోగించే విధానం, ఇన్‌స్టలేషన్ సమయంలోనూ, ఆ తర్‌వాతా సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల టైల్స్ లో లోపాలకు దారితీయవచ్చు. ఈ లోపాలలో అత్యంత సాధారణమైన లోపం టైల్ పైకి లేవడం.
ముందస్తు హెచ్చరిక లేకుండా పాపింగ్ (టైల్స్ పైకి లేవడం) లేదా బక్లింగ్ కావడం వల్ల ఇళ్లలో ఉండేవారి ఆరోగ్యానికి చాలా తీవ్రమైన ముప్పు కలుగుతుంది. కాబట్టి, టైల్స్ పైకి లేవడానికి గల కారణాలను అర్థం చేసుకోవడం మంచిది:
మీరు ఫ్లోర్ టైల్స్ వేయడానికి ముందు, అవి వేయడానికి ముందు వాటినీ, ఫ్లోర్‌నీ శుభ్రం చేయడం ముఖ్యం. అలా చేయకపోతే, మీరు టైల్స్ వంగడం, పైకి లేవడం వంటి పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఫ్లోర్‌ని సరిగా శుభ్రం చేయకపోతే, అంతటా సమానంగా అతుక్కోవలసిన పొరకి ఆ విధమైన సహకారం లభించదు.
పెద్ద సైజు టైల్స్ విషయంలో తప్పనిసరిగా ఉపయోగించాల్సిన నిర్దిష్ట ట్రోవెలింగ్ టెక్నిక్ ఉంది. టైల్ అడ్హెసివ్‌తో టైల్ అంటుకునేందుకు ఒక బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. మీరు చెక్క వస్తువుతో టైల్స్ ని కొట్టడం ద్వారా కూడా వాటిని లోపలికి నెట్టాల్సి ఉంటుంది.
అనుసరించాల్సిన విధానాన్ని అనుసరించకపోవడం వల్ల ఎగుడు దిగుడు టైలింగ్‌కు దారి తీస్తుంది, తద్వారా టైల్స్ పైకి లేచే అవకాశం ఉంటుంది.
టైల్స్ పారగమ్యంగా ఉంటాయి; అవి పదార్థాలూ, ద్రవాలు లోపలికి వెళ్లనిస్తాయి, ఎక్కువ స్థాయిలో తేమ, శోషణ కారణంగా అవి ఉబ్బుతాయి. దీని ఫలితంగా ఉపరితలం విస్తరిస్తుంది, దాని వలన వచ్చే ఒత్తిడి ఫ్లోర్స్ ని పైకి లేచేలా చేస్తుంది.
టైలింగ్ కోసం బాండింగ్ ఏజెంట్‌ను ఎన్నుకునేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన అంశం నాణ్యత. నాణ్యత లేని బాండింగ్ ఏజెంట్‌ను ఉపయోగిస్తే, టైల్స్ ఒక క్రింద ఉన్న పదార్థంతో సురక్షితమైన, దృఢమైన బంధాన్ని ఏర్పరుచుకోలేవు.
కాబట్టి, ఉష్ణోగ్రత మార్పులు లేదా తేమ వంటి వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పుల వల్ల టైల్స్ పై బాండింగ్ ఏజెంట్ పట్టు సడలుతుంది. ఇది లోపభూయిష్టమైన టైల్స్ కి లేదా టైల్స్ పైకి లేవడానికి కారణమవుతుంది.
ప్రత్యేకించి ఫ్లోర్ మీద నేరుగా సూర్యకాంతి పడే సందర్భమే అయితే, అత్యుత్తమ నాణ్యత కలిగిన టైల్ అడ్హెసివ్‌ని ఉపయోగించడం చాలా ముఖ్యం. అడ్హెసివ్‌ని అసలు ఉపయోగించకపోయినా లేదా పేలవమైన నాణ్యత కలిగిన అడ్హెసివ్‌ని ఉపయోగించినా సూర్యరశ్మి విస్తరణకు దారి తీస్తుంది. దాంతో ఒత్తిడి కారణంగా టైల్స్ పైకి లేస్తాయి.
పాత టైల్స్ ఉష్ణోగ్రత మార్పుల్ని తట్టుకోగల సామర్థ్యాన్ని కోల్పోతాయి కాబట్టి వాటిలోని పట్టు కోల్పోయి అవి పెళుసుగా మారతాయి. వీటిని ఉపయోగించడం వల్ల టైల్స్ పైకి లేచే అవకాశాలు పెరుగుతాయి.
కొన్నిసార్లు టైల్స్, తయారీ సమయంలోనే వంగిపోతాయి. వీటిని ఉపయోగించడం వలన టైల్స్ లో లోపభూయిష్టత లేదా పైకి లేచే అవకాశం పెరుగుతుంది.
సబ్‌ఫ్లోర్ ఎగుడు దిగుడుగా ఉంటే, అది అడ్హెసివ్‌కి గానీ లేదా మోర్టార్‌కి గానీ బలమైన మరియు ఏకరీతి (యూనిఫాం) బంధాన్ని ఏర్పరచదు. ఇది మీ ఫ్లోర్‌ని అసమానంగానూ, అసహ్యంగానూ కనిపించేలా చేస్తుంది.
మీరు ఇటీవల కొత్త ఇంటికి మారినట్లయితే, మీరు చేయవలసిన మొదటి పని ఏవైనా లోపాలున్న ప్రాంతాన్ని చెక్ చేయడం. ఇది త్వరిత చర్య తీసుకోవడానికీ, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికీ మీకు సహాయం చేస్తుంది.
కొత్త మార్పులు (రినొవేట్) చేస్తున్న సమయంలో కాంట్రాక్టర్ లేదా బిల్డర్ టైల్స్ పైకి లేవకుండా చేయడానికి అవసరమైన అన్ని జాగ్రత్తల్నీ తీసుకున్నారని నిర్ధారించుకోండి.
ప్రస్తుతం ఇంటియజమానులు ఏవైనా వదులుగా ఉన్న టైల్స్ ని గుర్తించాలంటే, లైట్ టూల్‌తో బోలుగా ఉన్న టైల్స్ ని కొట్టి చూడడం మంచి పద్ధతి. మీకు అలాంటి టైల్ ఏదైనా కనిపిస్తే, ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని ఫ్లోర్ టైల్స్ ని అడ్హెసివ్‌తో జెట్ చేయడం సులభమైన మార్గం.
టైల్స్ పైకి లేస్తే, మీరు ఈ క్రింది చర్యలు తీసుకోవచ్చు:
మీరు ఫ్లోర్ అంతటా వదులుగా ఉండే టైల్స్ ఉన్నట్టు గమనించి, ఇలా లేచిన టైల్స్ ని ఏ విధంగా రిపేర్ చేయాలా అని ఆలోచిస్తున్నట్లయితే, టైల్స్ ను తీసివేసి, ప్రక్రియను పూర్తిగా మళ్లీ చేయడమే ఈ సమస్యని పరిష్కరించడం అత్యంత సమగ్రమైన పద్ధతి.
1. టైల్స్ పైకి లేవడానికి కారణం ఏమిటి?
ఫ్వసేటప్పుడు సరిగా వేయకపోవడం, ఎగుడు దిగుడుగా ఉన్న సబ్‌ఫ్లోర్, తేమకి సంబంధించిన సమస్యలు, నాసిరకం అడ్హెసివ్ (జిగురు), భారీ ఫుట్ ట్రాఫిక్ లేదా నిర్మాణగత కదలికల (స్ట్రక్చరల్ మూవ్‌మెంట్) కారణంగా టైల్స్ పైకి లేవచ్చు లేదా వదులు కావచ్చు.
2. నేను వదులుగా ఉన్న టైల్‌ను స్వయంగా సరిచేయవచ్చా?
అడ్హెసివ్‌ని తొలగించడం, కొత్త అడ్హెసివ్‌ని అప్లై చేయడం ద్వారా టైల్‌ని మళ్లీ ఇన్‌స్టాల్ చేసి, లూజ్‌గా ఉన్న టైల్‌ను మీరే రీఇన్‌స్టాల్ చేయవచ్చు. అయినా, సమస్య మరింత తీవ్రంగా ఉంటే లేదా మీకు అందుకు అవసరమైన నైపుణ్యాలు లేకపోతే, నిపుణుల్ని పిలవడం ఉత్తమం.
3. అసలు టైల్స్ పైకి లేవకుండా నేను ఎలా ఆపగలను ?
టైల్స్ పైకి లేవకుండా ఆపాలంటే, అనుభవమున్న టైల్ ఇన్‌స్టాలర్‌ని నియమించుకోండి. టైల్స్ పైన ఎక్కువ తేమ ఉండకుండానూ, భారీ ఫుట్ ట్రాఫిక్ ఉండకుండానూ చేయండి, టైల్స్ ని క్రమం తప్పకుండా మెయింటెయిన్ చేస్తూ ఉండండి.
ఫ్లోర్ మీ ఇంటిలో ముఖ్యమైన భాగాలలో ఒకటి. టైల్స్ తో దీన్ని స్టైలింగ్ చేయడం వల్ల స్థలం అందం పెరుగుతుంది, టైల్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియకు కొంత మంచి ఏకాగ్రతా, ప్రయత్నం అవసరం.కాబట్టి, మీరు టైల్స్ వేయించడంలో మాత్రమే కాకుండా విరిగిన టైల్స్ ని సరిచేయడంలో కూడా సహాయపడే కాంట్రాక్టర్‌ని తెచ్చుకునేలా చూసుకోండి!