Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


మీ ఇంటి బయటి గోడలకు రంగును ఎంచుకోవడానికి 10 చిట్కాలు

మీరు మీ ఇంటి బయట పెయింట్ రంగులను ఎలా ఎంచుకోవాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నట్లయితే, ఈ కథనం బయటి ఇంటి రంగులను ఎలా ఎంచుకోవాలో సులభంగానూ, వేగంగాగానూ నిర్ణయం తీసుకునేలా చేస్తుంది.

Share:





బాహ్య గోడలకు రంగులు ఎంచుకోవడానికి చిట్కాలు



మీ ఇంటి నిర్మాణ ప్రయాణంలో అత్యంత ఉత్తేజకరమైన దశల్లో ఒకటి మీ ఇంటికి రంగుల ఎంపిక. మీరు ఎంచుకున్న రంగులు మీ ఇంటిని చూడముచ్చటగా, ఆకర్షణీయంగా ఉండేలా చేస్తాయి. బయటి ఇంటి పెయింట్ రంగుల ఎంపిక, అవగాహనను ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ రంగులను సరిగ్గా ఎంచుకునేందుకు గుర్తు పెట్టుకోవలసిన కొన్ని చిట్కాలను మేము మీకు అందిస్తున్నాము:

 

  • 1. కాంబినేషన్లు: తక్కువ కాంబినేషన్లు మంచిది:
    చాలా రంగులు చాలా చిందరవందరగా కనిపించవచ్చని గుర్తుంచుకోవడం ముఖ్యం. రంగులు సింపుల్ గా ఉండేలా చూసుకోవాలి. మీ ఇంటికి ఒకటి లేదా రెండు బాహ్య రంగులను ఎంచుకోవడం ఉత్తమం. రెండే అయితే చూడడానికి బాగుండదని మీరు అనుకుంటే, మీరు ఒకే రంగులో విభిన్న షేడ్స్ ని కూడా చూడవచ్చు.
  • 2. రంగుల ఎంపిక:
    రంగులను ఎన్నుకునే విషయానికి వస్తే, మీరు అనేక ఎంపికలను ఆదర్శంగా అన్వేషించాలి. ప్రేరణనిచ్చే ఉదాహరణల కోసం, సూచనల కోసం వెదకండి. మీకు ఇష్టమయ్యే రంగుల సంఖ్యని తగ్గించడానికి ప్రయత్నించి, ఆపై వాటి కాంబినేషన్లని వర్క ఔట్ చేయండి. సులభంగా దుమ్మును సేకరించే నలుపు, ఇంకా అలాంటి ముదురు రంగులను ఎంపిక చేసుకోకండి.
  • 3. కాంతిలో కారకం:
    షేడ్ కార్డ్ లో మీరు ఎంచుకునే రంగు, షేడ్ మీ ఇంటి వెలుపలికి వేసినప్పుడు, దానిపై పడే కాంతి నాణ్యతని బట్టీ, ఆ రకాన్ని బట్టీ అది చాలా భిన్నంగా కనిపిస్తుంది. గోడపై కొన్ని రంగులు, షేడ్స్ ని శాంపుల్ గా వేసుకుని చూస్తే అది ఎలా కనిపించబోతోంది అనే దాని గురించి మంచి ఆలోచన వస్తుంది.

  • 4. పరిసరాల విషయం:
    మీ ఇంటి వెలుపలి రంగులను ఎంచుకునేటప్పుడు మీ ఇంటి స్థానాన్నీ, దాని చుట్టూ ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. మీ ఇల్లు ప్రత్యేకంగా ఉండాలని మీరు కోరుకుంటే, మీ పరిసరాలూ, బ్యాక్‌డ్రాప్ రంగుల్ని మీ మానసిక స్థితికీ, వాతావరణానికీ అనుగుణంగా ఎంచుకునేలా చూసుకోవాలి.

  •  5. కేవలం పెయింట్‌లకు మించి ఆలోచించండి:
    మీ ఇంటి వెలుపలి భాగం కేవలం తలుపులూ, కిటికీలే కాకుండా కొన్ని గృహోపకరణాలు, కళాఖండాలు, మొక్కలు ఉంటే సజీవంగా ఉంటుంది. మెటీరియల్‌నీ, లైటింగ్‌నీ సరిగ్గా ఉండేలా ఎంచుకోండి. తద్వారా మీ బాహ్య రంగులతో కలిసి అన్నీ బాగానే ఉంటాయి. అలాగే, ట్రిమ్‌లు, యాక్సెంట్ రంగుల కోసం మంచి రంగు కాంబినేషన్లని ఎంచుకోండి.

  • 6. మన్నిక:
    మీ ఇంటి బాహ్య పెయింట్‌ను నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. పెయింట్‌లను ఎన్నుకునేటప్పుడు, రంగుతో సంబంధం లేకుండా, మీరు మన్నికైన పెయింట్ నీ, తక్కువ మెయింటెనెన్స్ గల పెయింట్‌లను ఎంచుకునేలా చూసుకోండి. సాధారణంగా, "శాటిన్" మరియు "ఎగ్‌షెల్" పెయింట్‌లు గొప్ప మన్నికను అందిస్తాయి, శుభ్రం చేయడం సులభం. అవి మీ రంగులకు చక్కని ఫినిష్ ని కూడా ఇస్తాయి.

  • 7. థీమ్:
    మీ ఇంటికి బాహ్య పెయింట్ రంగులను ఎలా ఎంచుకోవాలి అనే గందరగోళం నుండి తప్పించుకోవడానికి, మీరు ముందుగా థీమ్‌ను సెట్ చేయడంపై పని చేయాలి. బయట ఇంటి రంగు కోసం థీమ్‌ను సెట్ చేసుకుంటే, అది బయటి గోడలకి సరైన రంగును ఎంచుకోవడంలో మీకు సహాయపడడమే కాకుండా మీ ఇల్లు ఘోరంగా ఉందనిపించేలా కాకుండా అద్భుతంగా ఉందనిపించేలా చేస్తుంది.

  • 8. సీజన్:
    బయటి గోడలకు రంగులు సరైన సీజన్‌లో పెయింట్ చేస్తే సమర్ధవంతంగా చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. వేసవి కాలంలో పెయింట్ చేస్తే బాహ్య పెయింట్ జీవితకాలం పెరుగుతుంది. వేసవిలో సరైన ఉష్ణోగ్రత వద్ద పెయింట్ సరిగ్గా ఆరడానికి వీలుంటుంది. మీరు చలికాలం లేదా వర్షాకాలంలో బయటి భాగాలకు పెయింట్ చేస్తే, బాహ్య గోడలకు రంగులు వేసే ప్రక్రియను మళ్లీ మళ్లీ పునరావృతం చేయాలి.

  • 9. పరీక్ష:
    మీరు బయటి గోడలకు సరైన రంగు కోసం కొన్ని ఎంపికలను ఎంచుకున్న తర్వాత, కలర్ శాంపిల్స్ ని చూడండి. బాహ్య గోడలపై పెద్ద స్వాచ్‌లను పెయింట్ చేయండి. రోజులోని వివిధ సమయాల్లో ఈ స్వాచ్‌లను చూడండి. ఎండలోనూ, నీడలోనూ ఈ స్వాచ్‌లను వీక్షించండి; బాహ్య గోడలకు సరైన రంగును ఎంచుకోవడానికి ఇలా చేస్తే మీకు అర్థం అవుతుంది. మీరు ఏ రకమైన బయటి నుంచి ఇల్లు బాగా కనిపించాలంటే ఏ విధంగా ఉండాలనే విషయంగా మీకు ఇంకా గందరగోళంగా ఉంటే, మీరు ప్రొఫెషనల్ డిజైనర్ నుండి సహాయం పొందవచ్చు లేదా సన్నిహిత స్నేహితుడి నుండి సహాయం కోసం అడగవచ్చు.




నిపుణుల నుండి సహాయం కోరండి


లోపం లేని పెయింటింగ్ అనుభవాన్ని పొందడంలో సహాయపడేందుకూ, మార్గదర్శకత్వ సూచనలు పొందేందుకూ అల్ట్రాటెక్‌కి చెందిన గృహ నిర్మాణ కాంట్రాక్టర్‌ను సంప్రదించండి.


ఈ గైడ్ సహాయంతో, మీరు ఇంటికి అందమైన బాహ్య రూపాన్ని కలిగి ఉంటారు, కానీ ఇంటీరియర్స్ గురించి ఏమిటి? మీ ఇంటీరియర్‌లకు ప్రత్యేకమైన రూపాన్ని జోడించడానికీ, మీరు వేర్వేరు గోడ ఫినిషింగ్ లతో ప్రయోగాలు చేయాలి. మరింత తెలుసుకోవడానికి – వాల్ ఫినిషింగ్ రకాలు – బ్లాగ్ చదవండి.



సంబంధిత కథనాలు

 




సిఫార్సు చేయబడిన వీడియోలు



గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....