Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


కన్‌స్ట్రక్షన్‌లో జాయింట్ల రకాలు

కాంక్రీటుకి రెండు గొప్ప లక్షణాలు ఏమిటంటే, దాని కాఠిన్యత, అధిక సంపీడన (హై కంప్రెసివ్) బలం. నిర్మాణ ప్రక్రియల సమయంలో కాంక్రీటుని ఎక్కువగా ఉపయోగించబడటానికి ఈ లక్షణాలూ రెండు ప్రధాన కారణాలు.

Share:


అయితే, అన్ని మంచి విషయాలకీ ఏదో ఒక రకమైన ప్రతికూలత ఉంటుంది. కాంక్రీటు విషయంలో ఇది సాగే పదార్థం కాదు; అది వంగదు, సాగదు. దీనికున్న ఈ సామర్థ్యం పై వైపునా, క్రింద వైపునా కూడా ఉంటుంది.

కానీ కాంక్రీటుకి గల ఈ పెళుసు లక్షణం దాన్ని కదలకుండా అడ్డుకోలేదు. కాంక్రీట్‌ని కుదించవచ్చు, విస్తరించవచ్చు, దీని వలన భవనాన్ని వివిధ మార్గాల్లో కదిలేలా చేయవచ్చు. అయితే ఈ కదలికలను చాలా జాగ్రత్తగా చేయడానికి కాంక్రీటు విరిగిపోకుండా లేదా పగుళ్లు రాకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం.

ఇక్కడ కన్‌స్ట్రక్షన్‌ జాయింట్లు చిత్రంలోకి వస్తాయి.



కన్‌స్ట్రక్షన్‌ జాయింట్ అంటే ఏమిటి?

ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులు కాంక్రీటుని కుంచించుకుపోయేలానూ, విస్తరించుకునేలానూ చేయడానికి కారణమవుతాయి. ఇది పదార్థం పరిమాణాన్ని మారుస్తుంది. ఈ వాల్యూమ్ మార్పు పగుళ్లకీ లేదా విరగడానికీ కారణం కావచ్చు.

 

కాబట్టి, దీనిని నివారించడానికి, కన్‌స్ట్రక్షన్‌ జాయింట్లను విరగకుండా చేసే సాధనంగా ఉపయోగిస్తారు. కాంక్రీటు పరిమాణం, పొడవు పేర్కొన్న పరిమితిని మించి ఉంటే, కన్‌స్ట్రక్షన్‌ జాయింట్లను ఉపయోగించడం చాలా ముఖ్యమైనది. సాధారణంగా, కొద్దిపొడవు గల కాంక్రీట్ పదార్థాలకి జాయింట్లు అవసరం లేదు.

 

ఎందుకంటే కొద్దిపాటి పొడవు గల కాంక్రీటుని విస్తరించడానికి, చివరి బిందువు (ఎండ్ పాయింట్) దగ్గరగా ఉంటుంది. బీటలు ఇచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాంక్రీట్ పదార్థాలు నిర్దిష్ట పరిమితిని దాటితే ఈ అవకాశం పెరుగుతుంది.

 

కన్‌స్ట్రక్షన్‌ జాయింట్ దేనికి ఉపయోగించబడుతుందా అని మీరు ఆలోచిస్తున్నారా, ఇది మల్టిపుల్ (అనేక) కన్‌స్ట్రక్షన్‌ అంశాల డిజైనింగ్‌కీ, నిర్మాణానికీ ఉపయోగించబడుతుంది. ఎక్కువగా, వీటిలో పగుళ్లు రాకుండా చేయడానికి కాంక్రీట్ స్లాబ్‌లూ, పేవ్‌మెంట్‌ల నిర్మాణంలో ఒక క్రమబద్ధమైన అంతరంలో ఉంచుతారు.

ఇలా చెప్పిన తరువాత, వివిధ కాంక్రీట్ కన్‌స్ట్రక్షన్‌ జాయింట్ రకాలను పరిశీలిద్దాం:


కన్‌స్ట్రక్షన్‌లో జాయింట్ల రకాలు

ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి నిర్మాణంలో వివిధ రకాలైన జాయింట్లు ఇన్స్టాల్ చేయబడతాయి. మెరుగైన నిరోధకత (రెసిస్టెన్స్), భద్రత కోసం మీరు నిర్దిష్ట కాంక్రీట్ స్లాబ్‌లో వేర్వేరు కన్‌స్ట్రక్షన్‌ జాయింట్లను ఉంచవచ్చు.

మీరు ఇన్‌స్టాల్ చేయగల వివిధ కాంక్రీట్ జాయింట్ రకాలు ఇక్కడ ఉన్నాయి:

1. కాంక్రీట్ కన్‌స్ట్రక్షన్‌ జాయింట్లు



కన్‌స్ట్రక్షన్‌ జాయింట్‌లు సాధారణంగా కాంక్రీట్ స్లాబ్‌లలో విడిగా ప్రతి ప్లేస్‌మెంట్‌ పరిధిని గుర్తించడానికి అమర్చబడతాయి. అవి సాధారణంగా స్లాబ్ రెండు వైపులా మధ్య ఉన్న స్థానాన్ని పూడ్చేందుకు స్లాబ్‌లోని బయటి బరువుల వల్ల వంగేలా (ఫ్లెక్చరల్) చేసే ఒత్తిళ్లను బదిలీ చేయడానికి డిజైన్ చేయబడ్డాయి.

సాధారణంగా, ఈ జాయింట్లు ఇప్పటికే స్థిర జాయింట్ లేఅవుట్కు అనుగుణంగా రూపొందించబడ్డాయి.

 

2. విస్తరణ జాయింట్లు



కాంక్రీటు వాల్యూమ్ మారుతున్న పరిస్థితులలో, ఒత్తిడిని తగ్గించడానికి జాయింట్లు అవసరం. అటువంటి సందర్భాలలో ఒక భవనం భాగాల మధ్య ఖాళీని సృష్టించడానికి విస్తరణ జాయింట్లు అమర్చబడతాయి.

45 మీ కంటే ఎక్కువ పొడవు ఉన్న భవనం సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ విస్తరణ జాయింట్‌తో అందించబడుతుంది. భారతదేశంలో 30మీటర్ల సి/సి అంతరం (స్పేసింగ్) సిఫార్సు చేయబడింది.

 

3. సంకోచించుకునే జాయింట్లు



కాంక్రీట్ సంకోచించుకునే జాయింట్లని సాధారణంగా సరళ రేఖలో బలహీనమైన ప్రదేశాన్ని ఏర్పరిచే కాంక్రీట్ స్లాబ్‌లలో పొడవైన కమ్మీలు (గ్రూవ్‌లు) కత్తిరించబడతాయి, ఏర్పడతాయి లేదా టూల్ చేయబడతాయి. పేవ్‌మెంట్‌లలో ఉపయోగించే జాయింట్ రకం ఇది.

స్లాబ్‌లో డైమెన్షనల్ మార్పుల ద్వారా, ఇది పగుళ్ల స్థానాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అదుపు చేయలేని పగుళ్లు పెరుగుతాయి. ఇవి ఉపరితలంపై ఒక కఠినమైన ఉపరితలం ఏర్పడడానికీ, నీటి చొరబాటుకీ, ఒత్తిడికీ కారణమవుతాయి. వీటిని నివారించడానికి సంకోచించుకునే జాయింట్లు స్లాబ్ లలో పెడతారు.

 

4. ఐసోలేషన్ జాయింట్లు



పేరు చూస్తేనే మనకి అర్థమవుతుంది: కాంక్రీట్ స్లాబ్‌ని వేరే వాటి నుండి పూర్తిగా వేరుచేయడానికి ఇవి ఉపయోగించబడతాయి. గోడ, స్తంభం లేదా డ్రెయిన్ పైపు ఇలా ఏవైనా, కాంక్రీట్ ఐసోలేషన్ జాయింట్లు అన్నింటి నుంచీ స్లాబ్‌ని వేరుచేయడానికి ఉపయోగపడతాయి.

స్లాబ్‌ పోయడానికి ముందు గోడ, స్టాండ్‌పైప్ లేదా కాలమ్‌కు ప్రక్కనే గతంలో నిర్ణయించిన జాయింట్ మెటీరియల్‌ని అమర్చి ఈ జాయింట్లని ఇన్‌స్టాల్ చేస్తారు.

5. అలంకార కాంక్రీటు జాయింట్లు



ఈ జాయింట్లని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు బాగా ఆలోచించి ప్రణాళికాబద్ధంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. జాయింట్లు స్లాబ్ ఉపరితలంలో 1/4వ వంతు మాత్రమే చొచ్చుకుని వెళ్తాయి. స్లాబ్ గట్టిగా ఉండడం అవసరం కాబట్టి అలంకారప్రాయంగా ఉండే స్టాంపింగ్ మరీ లోతుగా వెళ్లదు.

మీరు చేయాల్సిందల్లా క్రాకింగ్ నియంత్రించబడేలానూ, జాయింట్లు కనిపించకుండా చేసేలానూ స్టాంప్డ్ డిజైన్ నమూనాని బట్టి కత్తిరించడమే.

 

మనం కాంక్రీటులో జాయింట్లను ఎందుకు పెట్టాలి?



కాంక్రీటు ఉపరితలం మీద పగుళ్లు ఏర్పడే పరిస్థితిలో ఉంటే, మొదటగా బాగా బలహీనమైన ప్రాంతం ఒత్తిడికి గురై పగుళ్లు ఏర్పడతాయి. బిల్డింగ్ జాయింట్‌లు లేదా కన్‌స్ట్రక్షన్‌ జాయింట్‌లను ఉపయోగించి, జాయింట్లపై ఒత్తిడిని వాటికి బదిలీ చేయడం ద్వారా ఉపరితల (సర్ఫేస్) పగుళ్లకు సంబంధించిన కాంక్రీటు బాధ్యతని తొలగించవచ్చు.

కాంక్రీట్ జాయింట్లు నిలువు మరియు భ్రమణ (రొటేషనల్) కదలికలను పరిమితం చేస్తూ, సమాంతర కదలికను ప్రారంభిస్తాయి, కాంక్రీటు కన్‌స్ట్రక్షన్‌ అకాల వైఫల్యాన్ని విజయవంతంగా నివారిస్తాయి.

 

ఇది కూడా చదవండి : కాంక్రీటులో పగుళ్ల రకాలు



కన్‌స్ట్రక్షన్‌ జాయింట్ అంటే ఏమిటో, అలాగే కన్‌స్ట్రక్షన్‌లో ఏ రకమైన జాయింట్లు ఉన్నాయో తెలుసుకోవడం, మంచి ప్లానింగ్ కలిగి ఉండడం వల్ల మీకు కావలసిన చోట మాత్రమే పగుళ్లు ఏర్పడేలా చేయవచ్చు, అలా చేయడం మీ కాంక్రీట్ నిర్మాణాన్ని చాలా కాలం మన్నేలా చేస్తుంది.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు

 




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....