Share:
Home Building Guide
Our Products
Useful Tools
Product
UltraTech Building Products
Waterproofing Systems
Crack Filler
Style Epoxy Grout
Tile & Marble Fitting System
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
వివిధ రకాలైన మిక్సర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రకం మిశ్రమం చేయబడిన పదార్థాల స్వభావం, కావలసిన ఫలితాన్ని బట్టి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. కాంక్రీట్ మిక్సర్ యంత్రాలలో రెండు విస్తృత వర్గాలు ఉన్నాయి, కాంక్రీట్ బ్యాచ్ మిక్సర్లు, కంటిన్యువస్ మిక్సర్లు. మనం ఈ రెండింటి గురించీ, వాటిలో ఉన్న రకాల గురించీ వివరంగా తెలుసుకుందాం.
కాంక్రీట్ బ్యాచ్ మిక్సర్ అనేది ఒక సమయంలో నిర్దిష్ట పరిమాణంలో కాంక్రీటును కలపడానికి నిర్మాణ పరిశ్రమలో ఉపయోగించే ఒక రకమైన మిక్సర్. కాంక్రీటు కోసం డిమాండ్ మరీ ఎక్కువగా లేని చిన్న మధ్య తరహా నిర్మాణ ప్రాజెక్టులకు ఈ రకమైన మిక్సర్ అనుకూలంగా ఉంటుంది. కాంక్రీట్ బ్యాచ్ మిక్సర్ సాధారణంగా డ్రమ్ లేదా కంటైనర్‌ను కలిగి ఉంటుంది, ఇక్కడ అన్ని పదార్థాలు ముందుగా నిర్ణయించిన క్రమంలో జోడించబడతాయి. ఈ పదార్థాలు సాధారణంగా సిమెంట్, ఇసుక, నీరు, ముక్కలు చేసిన రాయి లేదా కంకర లేదా గ్రావెల్ అయి ఉంటాయి. ఈ మిక్సర్ వివిధ పరిమాణాలలో వస్తుంది. మిక్సర్ పరిమాణం కలపవలసిన కాంక్రీటుని బట్టి నిర్ణయింపబడుతుంది. చిన్న బ్యాచ్ మిక్సర్‌లు 1 క్యూబిక్ యార్డ్ కాంక్రీట్‌ను కలిగి ఉంటాయి, అయితే పెద్ద మిక్సర్‌లు 6 క్యూబిక్ గజాల వరకు లేదా అంతకంటే ఎక్కువ కాంక్రీటును కలిగి ఉంటాయి.
నిర్మాణ ప్రాజెక్టుల కోసం కాంక్రీట్ బ్యాచ్ మిక్సర్ అనేది చిన్న సైజు నుంచి మధ్యస్థ పరిమాణం వరకు ఒక విశ్వసనీయమైన, సమర్థవంతమైన ఎంపిక, ఇక్కడ నిర్దిష్ట పరిమాణంలో కాంక్రీటును ఒకేసారి కలపాలి.
డ్రమ్ మిక్సర్, బారెల్ మిక్సర్ అని కూడా పిలుస్తారు, ఇది నిర్మాణ పరిశ్రమలో పెద్ద మొత్తంలో కాంక్రీటు లేదా సిమెంటును కలపడానికి ఉపయోగించే ఒక రకమైన మిక్సర్. ఇది దాని అక్షం మీద తిరిగే డ్రమ్ లేదా బారెల్‌ను కలిగి ఉంటుంది, డ్రమ్ లోపలి భాగంలో బ్లేడ్‌లు లేదా రెక్కలు జతచేయబడి కాంక్రీటు తిరిగేటప్పుడు కలపడానికి సహాయపడతాయి. పెద్ద మొత్తంలో కాంక్రీటును సమర్ధవంతంగా కలపగల సామర్థ్యం వాటికి ఉంటుంది. ఇతర రకాల మిక్సర్లతో పోలిస్తే అవి పనిచేయడం కూడా సులభం, పైగా తక్కువ శ్రమ అవసరం. అందువల్ల వాటిని చిన్న పెద్ద నిర్మాణ ప్రాజెక్టుల్లో ఉపయోగించడానికి వీలవుతుంది. కాంక్రీటు, మోర్టార్ లేదా ఏ ఇతర నిర్మాణ సామగ్రినైనా కలపడానికి ఉపయోగించవచ్చు.
డ్రమ్ మిక్సర్లను మూడు వర్గాలుగా వర్గీకరించవచ్చు: టిల్టింగ్ డ్రమ్ మిక్సర్లు, నాన్-టిల్టింగ్ డ్రమ్ మిక్సర్లు, రివర్సింగ్ డ్రమ్ మిక్సర్లు.
టిల్టింగ్ డ్రమ్ మిక్సర్లు టిల్టింగ్ డ్రమ్‌తో రూపొందించబడ్డాయి, వీటిని మిశ్రమ కాంక్రీటు లేదా సిమెంటును పోయడానికి తిప్పుతూ ఉంటారు, వీటిని నిర్మాణ ప్రాజెక్టులకు మెటీరియల్‌ను త్వరగా అన్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మిక్సర్లు దాని అక్షం మీద వంగి ఉండే డ్రమ్‌ను కలిగి ఉంటాయి, ఇది మిశ్రమ పదార్థాన్ని డ్రమ్ నుండి నిర్దేశిత ప్రదేశంలోకి పోయడానికి అనుమతిస్తుంది. నాన్-టిల్టింగ్ డ్రమ్ మిక్సర్‌లతో పోలిస్తే ఈ రకమైన మిక్సర్‌ల ఉపయోగాల్లో ఒకటి ఏమంటే, డ్రమ్‌ను వంచడం ద్వారా మిశ్రమ పదార్థాన్ని సులభంగా అన్‌లోడ్ చేయవచ్చు. కాబట్టి వాటికి తక్కువ మాన్యువల్ లేబర్ అవసరం. ఇది చిన్న, మధ్య తరహా నిర్మాణ ప్రాజెక్టులకు వీటిని ఎక్కువగా ఎంచుకునేలా చేస్తుంది.
టిల్టింగ్ డ్రమ్ మిక్సర్ల వలె కాకుండా, నాన్-టిల్టింగ్ డ్రమ్ మిక్సర్లు టిల్టింగ్ మెకానిజంను కలిగి ఉండవు. మిశ్రమ పదార్థాన్ని అన్‌లోడ్ చేయడానికి మాన్యువల్ లేబర్‌పై ఆధారపడతాయి. ఈ కాంక్రీట్ మిక్సర్ ప్రయోజనాల్లో చెప్పుకోదగ్గ ప్రయోజనం ఏమిటంటే, వాటి సింపిల్ డిజైన్, సులభమైన ఆపరేషన్ విధానం. అవి చిన్న, మధ్య తరహా నిర్మాణ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉంటాయి. తడి, పొడి మిశ్రమాలను కలపడానికి ఉపయోగించవచ్చు. మిగతా వాటితో పోలిస్తే వాటికి తక్కువ మెయింటెనెన్స్ చాలు. అయినా, మిశ్రమ పదార్థాన్ని దానంతట అదే అన్‌లోడ్ చేయడంలో దాని అసమర్థత ప్రధాన లోపాలలో ఒకటి. మిశ్రమ పదార్థాన్ని అన్‌లోడ్ చేయడానికి మాన్యువల్ శ్రమ అవసరం. పెద్ద నిర్మాణ ప్రాజెక్టులకు దీని పనితనం సరిపోక పోవచ్చు.
మిక్సింగ్ బ్లేడ్‌లు పదార్థాన్ని సమర్థవంతంగా కలపడానికి వీలు కల్పిస్తూ రివర్సింగ్ డ్రమ్ మిక్సర్ డ్రమ్ రెండు దిశలలో తిరుగుతుంది. డ్రమ్‌లో మిక్సింగ్ బ్లేడ్‌లు లేదా రెక్కలు డ్రమ్ లోపలికి జోడించబడి మెటీరియల్‌ని కలపడానికి సహాయపడతాయి. ఈ రకమైన మిక్సర్ ప్రయోజనాల్లో ఒకటి తడి, పొడి మిశ్రమాలతో సహా అత్యంత సజాతీయ కాంక్రీటు మిశ్రమాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉండడం. అవి చిన్న, మధ్య తరహా నిర్మాణ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉంటాయి. సులభంగా శుభ్రం చేయబడతాయి, నిర్వహించబడతాయి. అయితే మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ ధర ఉండడం వల్ల కొన్ని నిర్మాణ ప్రాజెక్టులకు ఈ రకం అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు.
దాని వృత్తాకార మిక్సింగ్ పాన్ కారణంగా దీనిని సర్క్యులర్ మిక్సర్ లేదా పాన్ మిక్సర్ అని కూడా పిలుస్తారు. ఈ కాంక్రీట్ మిక్సర్ ఒక వృత్తాకార మిక్సింగ్ పాన్‌ను కలిగి ఉంటుంది, ఇది చక్రాలతో ఫ్రేమ్‌పై అడ్డంగా అమర్చబడి ఉంటుంది. అత్యంత సజాతీయ కాంక్రీటు మిశ్రమాలను ఉత్పత్తి చేయగల వీటి సామర్థ్యం వీటి ప్రయోజనాల్లో ఒకటి. తడి/పొడి మిశ్రమాలు, మోర్టార్, ప్లాస్టర్, వక్రీభవన (రిఫ్రాక్టరీ) మెటీరియల్స్ సహా వివిధ రకాల కాంక్రీట్ మిశ్రమాలను ఉత్పత్తి చేయడానికి పాన్-టైప్ మిక్సర్‌లు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే, ఇతర రకాల మిక్సర్లతో పోలిస్తే వీటికి తక్కువ మిక్సింగ్ సామర్థ్యం ఉంటుంది, అదే ఈ రకంలోని ప్రధాన లోపాలలో ఒకటి. అధిక సామర్థ్యం గల మిక్సింగ్ పరికరాలు అవసరమయ్యే పెద్ద నిర్మాణ ప్రాజెక్టులకు అవి తగినవి కాకపోవచ్చు.
వీటిని కంటిన్యువస్ మిక్సర్లు, కంటిన్యువస్ ఫ్లో మిక్సర్లు అని కూడా పిలుస్తారు, కాంక్రీటు లేదా ఇతర నిర్మాణ సామగ్రిని కలపడానికి నిర్మాణ పరిశ్రమలో ఉపయోగించే ఒక రకమైన మిక్సర్. బ్యాచ్ మిక్సర్‌ల మాదిరిగా కాకుండా, ఒక సమయంలో ఒక నిర్దిష్ట మొత్తంలో మెటీరియల్‌ని మిక్స్ చేస్తుంది. ఈ సిమెంట్ మిక్సర్ మెటీరియల్స్ మిక్సింగ్ ఛాంబర్ గుండా కదులుతున్నప్పుడు వాటిని అది ఎడతెరిపి లేకుండా మిక్స్ చేస్తుంది. పదార్థం ఒక చివర మిక్సింగ్ చాంబర్‌లోకి నిరంతరంగా వేయబడుతూ ఉంటుంది, మిశ్రమ పదార్థం మరొక చివర నుండి నిరంతరం విడుదల చేయబడుతూ ఉంటుంది. వీటికి సజాతీయ పదార్థాన్ని త్వరగా, సమర్ధవంతంగా, పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటుంది. కాంక్రీటు (తడి, పొడి మిశ్రమాలతో సహా), మోర్టార్ తారుతో సహా అనేక రకాల నిర్మాణ సామగ్రిని కలపడానికి వీటిని ఉపయోగించవచ్చు.
అయితే, వీటిలో ఉన్న ప్రధాన లోపాలలో ఒకటి వాటి ధర మిగతా వాటితో పోల్చి చూస్తే చాలా అధికంగా ఉంటుంది. వీటితో పని చేయించడానికి కూడా మిగతా వాటి కంటే పెద్ద మొత్తంలో స్థలం అవసరం. వీటిని చిన్న నిర్మాణ ప్రాజెక్టులకు అంత అనుకూలమైనవి కావు.
కాంక్రీటు లేదా ఇతర నిర్మాణ సామగ్రిని కలపడానికి నిర్మాణ పరిశ్రమలో ఉపయోగించే అనేక రకాల మిక్సర్లు ఉన్నాయి. అత్యంత సాధారణ రకాలు బ్యాచ్ మిక్సర్లు, డ్రమ్ మిక్సర్లు, పాన్-రకం మిక్సర్లు, టిల్టింగ్ డ్రమ్ మిక్సర్లు, నాన్-టిల్టింగ్ డ్రమ్ మిక్సర్లు, రివర్సింగ్ డ్రమ్ మిక్సర్లు, కంటిన్యువస్ మిక్సర్లు. దిగువన ఉన్న సిమెంట్ మిక్సర్ల గురించి సారాంశం ఈ క్రింద ఇవ్వబడింది:
చివరిగా చెప్పాలంటే, ఏ రకమైన మిక్సర్ కైనా, దానివైన ప్రయోజనాలూ, లోపాలూ కలిగి ఉంది. మిక్సర్ ఎంపిక నిర్మాణ ప్రాజెక్ట్ నిర్దిష్ట అవసరాలపై ఆధారపడి ఉంటుంది. నిర్మాణ ప్రాజెక్ట్ కోసం తగిన రకాలైన కాంక్రీట్ మిక్సర్లను ఎన్నుకునేటప్పుడు మిక్సింగ్ సామర్థ్యం, వేగం, వైవిధ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.