Share:
Home Building Guide
Our Products
Useful Tools
Product
UltraTech Building Products
Waterproofing Systems
Crack Filler
Style Epoxy Grout
Tile & Marble Fitting System
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
మానవ జనాభా భారీ నీటి కొరతను ఎదుర్కొంటోంది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా నీటి-ఒత్తిడి ఉన్న ప్రాంతాలలో నివసిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి (వాటర్ ఎయిడ్). మానవ జాతి మంచి నీటిని పొందడానికి సహాయపడే వ్యవస్థ ఇప్పుడు తక్షణావసరంగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం వర్షపు నీటి నిల్వ. ఇది మంచినీటిని యాక్సెస్ చేయడానికి అత్యంత స్థిరమైన మార్గం. అలాగే ఇది పనిచేయడం కోసం ఎటువంటి శక్తి వినియోగమూ అవసరం లేదు. ఇది ఏ సహజ వనరులనూ క్షీణింపజేయదు. ఇందుకు విరుద్ధంగా, సహజ ఆవాసాలను సంరక్షించడానికీ, సురక్షించడానికీ సహాయపడుతుంది. ఈ వ్యాసం వర్షపు నీటి సంరక్షణలో ఉన్న దశలను అర్థం చేసుకోవడం, అలాగే వర్షపు నీటి సంరక్షణ ఎంత అవసరమో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
సముద్రంలోని ఉప్పునీరు సూర్యుని వేడికి ఆవిరై, మేఘాలుగా ఏర్పడి మంచినీటి వర్షంగా కురుస్తుంది. ఈ వర్షపు నీటిలో గణనీయమైన భాగం మహాసముద్రాలూ, మురికి కాలువలలోకి ప్రవహిస్తుంది. మనం దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే, ఇది వివిధ అప్లికేషన్ల కోసం ఉపయోగించబడే ముఖ్యమైన వనరు కావచ్చు. కాబట్టి, సంక్షిప్తంగా చెప్పాలంటే, వర్షపు నీటి సంరక్షణ అనేది వర్షపు నీరు వృథా కానీయకుండా పునర్వినియోగం కోసం నిల్వ చేసే ప్రక్రియ. అయితే, అంతకంటే ముందు వర్షపు నీటి సంరక్షణ దశలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.
వర్షపు నీటి సంరక్షణ రకాలు వ్యవస్థను బాగా అర్థం చేసుకోవడానికి మనకి సహాయపడతాయి. వాటి గురించి తెలుసుకుంటే, మనకు ఏది బాగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. తదనుగుణంగా వర్షపు నీటి సంరక్షణ దశల గురించి తెలుసుకోండి.
వర్షపు నీటి సంరక్షణ దశలను తెలుసుకోవడానికి ముందు, వర్షపు నీటి సంరక్షణ ప్రయోజనాలను తెలుసుకుందాం.
భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేలా చేస్తుంది: జనాభా పెరుగుదలతో, భూగర్భ జలాలపై ఆధారపడటం పెరుగుతోంది. అనేక నివాస కాలనీలు పరిశ్రమలు తమ రోజువారీ అవసరాల్ని నెరవేర్చడానికి భూగర్భ జలాలను వెలికితీస్తున్నాయి. C50దీనివల్ల భూగర్భజలాలు అడుగంటి పోయి నీటి ఎద్దడి ఉన్న కొన్ని ప్రాంతాల్లో గణనీయంగా తక్కువ స్థాయికి వెళ్లింది. వర్షపు నీటి సంరక్షణ భూగర్భజలాలు క్షీణించకుండా మరింత నిలకడగా ఉండేలా చేస్తుంది.
కరువు ప్రభావాన్ని తగ్గిస్తుంది: చాలా దేశాలు, ప్రత్యేకించి పొడిబారిన వాతావరణం ఉన్న దేశాలు, చౌక ధరలో, విశ్వసనీయమైన, స్వచ్ఛమైన నీటి వనరుగా వర్షపు నీటి సేకరణను ఉపయోగిస్తాయి. కరువు ఏర్పడినప్పుడు, గత నెలల్లో సేకరించిన వర్షపు నీటిని ఉపయోగించవచ్చు. ఎడారుల్లోనూ, కొండ వాలుల నుండి వర్షపు నీటిని సేకరించి నిల్వ ఉంచడానికీ, అలా పారే నీరు వృథా పోకుండా నిరోధించడానికీ, నీటిపారుదలని మెరుగుపరచడానికీ మట్టి గట్లు నిర్మించబడ్డాయి. తక్కువ వర్షపాతం ఉన్న కాలంలో కూడా పంటలు పండేందుకు సరిపడా నీరు ఆ విధంగా సేకరిస్తారు.
భూగర్భ జలాల పట్టికను మెరుగుపరుస్తుంది, తద్వారా నీటిని ఎత్తిపోసేందుకు శక్తిని ఆదా చేస్తుంది: వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు నీటి స్థాయిని దాని నాణ్యతను పెంచడానికి భూగర్భ జలాశయానికి ఉపరితలం నుంచి పారే నీరు వెళ్లి రీఛార్జ్ చేస్తుంది. దీనివల్ల తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ స్థిరమైన భూగర్భ జలాల (గ్రౌండ్ వాటర్) టేబుల్ ఏర్పడుతుంది.
భూగర్భంలో నీటిని నిల్వ చేయడం పర్యావరణానికి మంచిది: వర్షపు నీటిని భూగర్భంలో నిల్వ చేయడం వల్ల బాష్పీభవనాన్ని తొలగిస్తుంది. దీర్ఘకాలిక నిల్వను అందిస్తుంది, ఇది భూగర్భజల సరఫరాను కూడా తిరిగి నింపుతుంది. సముద్రపు నీరు చొరబడకుండా నిరోధించవచ్చు. వాటి మనుగడ కోసం భూగర్భ జలాలపై ఆధారపడిన పర్యావరణ వ్యవస్థలను కాపాడుతుంది.
ఇది తక్కువ ఖర్చుతో సరిపోతుంది: వర్షపు నీటి సంరక్షణ అనేది ఇతర నీటి రీసైక్లింగ్ పద్ధతులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయం. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి అయినందున మాటిమాటికీ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా, ఇది వివిధ మార్గాల ద్వారా ఇంటి వరకు నీటిని రవాణా చేసుకోవలసిన అవసరాన్ని తొలగిస్తుంది..
ఇది నీటిని ఆదా చేయడంలో సహాయపడుతుంది: నీటిని సేకరించే ఆలోచన నీటిని ఆదా చేయడానికీ, దానిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికీ మీకు వీలుంటుంది. నీటి సంరక్షణకు ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం. అయితే, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థపై అదనపు శ్రద్ధ వహించండి. కాంక్రీటు బలం పరీక్ష, కాంక్రీటు క్యూరింగ్, ఇంకా కాంక్రీటును రవాణా చేయడం, కాంక్రీట్ సరిగ్గా వేయడం వంటివి జాగ్రత్తగా నిర్వహించండి.
వర్షపు నీటి సంరక్షణ దశలు సుదీర్ఘంగా అనిపించవచ్చు, అయితే సరిగ్గా అమలు చేయబడినట్లయితే, ఈ వ్యవస్థ మీకు జీవితకాలం పాటు ఉంటుంది.
మెష్ ఫిల్టర్ ఓపెనింగ్ మరియు ఫస్ట్ ఫ్లష్ (రూఫ్ వాషర్ అని కూడా అంటారు) పరికరం ట్యాంక్ నుండి మొదటి నీటి ప్రవాహాన్ని మళ్లిస్తుంది.
నిల్వ ట్యాంక్‌కు కనెక్ట్ చేయడానికి ముందు వడపోత వ్యవస్థ.
మురికినీటి బ్యాక్‌ఫ్లో నిరోధించడానికి ఒక ఎయిర్ గ్యాప్.
ప్రతి ట్యాంక్ అదనపు నీటి ఓవర్‌ఫ్లో వ్యవస్థను కలిగి ఉండాలి.
అదనపు నీటిని రీఛార్జ్ వ్యవస్థకు మళ్లించవచ్చు.
4. పైపులు ట్యాంకులను ఇన్స్టాల్ చేయండి:
పైపుల ఇన్స్టలేషన్ కోసం:
పైపులు వేయడానికి అవసరమైన అనుమతులు (అవసరమైతే) అధికారుల నుండి పొందండి.
భూగర్భంలో వేయబడి ఉంటే, కందకాలు తవ్వండి.
శుభ్రపరచడానికి సులభంగా చేరుకోలేని ప్రదేశాలలో అవక్షేపాలు సేకరించకుండా ఉండటానికి పైపును నేరుగా క్రిందికి ఉంచడం మంచిది.
పైపులను కందకాలలో వేయండి లేదా కనెక్టర్లను ఉపయోగించి కనెక్ట్ చేయండి.
ట్యాంకుల్ని ఇన్స్టాల్ చేయడం కోసం:
ఆస్తికి సరిపోయే ట్యాంక్ స్టాండ్‌ని తయారు చేయండి..
ట్యాంకులను స్టాండ్‌పై ఉంచండి మరియు అవి ఖాళీగా ఉన్నప్పుడు ఊడిపోకుండా ఉండేలా చూసుకోండి.
వాటిని కనెక్ట్ చేయండి, తద్వారా అవి ఒక వాల్యూమ్‌గా ఉండవచ్చు. నిర్వహణ కోసం చాలా వరకు ప్రతి ట్యాంక్‌కు వాల్వ్ పెట్టాలని సిఫార్సు చేస్తున్నాము.
మీ వర్షపు నీటిట్యాంక్ నుండి అత్యంత కలుషితమైన వర్షపు నీటిని దూరంగా ఉంచడానికి మొదటి ఫ్లష్ డైవర్టర్‌లను ఇన్‌స్టాల్ చేయండి.
ఒక విధమైన ఓవర్‌ఫ్లో అమరికను కనెక్ట్ చేయండి. ట్యాంకులు సంప్‌లో ఉన్నట్లయితే, దానికి ఓవర్‌ఫ్లో ఏర్పాటు చాలా డ్రైనేజీలు అవసరమవుతాయి. ఓవర్‌ఫ్లో తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు, పంపులు నీటిని వరదలా వదిలేస్తూనే ఉంటాయి.
PVC కలెక్టర్ పైపులకీ, ట్యాంకులకీ మధ్య ఫైనల్ కనెక్షన్ ఇవ్వండి.
మీ నీటి స్థాయి వినియోగాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి ట్యాంక్ గేజ్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
ఈ వర్షపు నీటి సంరక్షణదశలు మీకు మంచి వ్యవస్థను కలిగి ఉండేలా చేస్తాయి.