Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost


Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


గోడలలో పగుళ్లను ఎలా రిపేర్ చేయాలి: పూర్తి గైడ్

గోడలలో పగుళ్లు సాధారణ సమస్యలు, కానీ గోడలలో పగుళ్లను ఎలా సరిచేయాలి అనేది శాశ్వతమైన ప్రశ్న. ఈ సమగ్ర గైడ్‌తో, గోడలలో పగుళ్లను ఖచ్చితత్వంతో సామర్థ్యంతో ఎలా రిపేర్ చేయాలో మీరు నేర్చుకుంటారు.

Share:


మీకు ఒక సొంత ఇల్లు ఉన్నా లేదా మీరెప్పుడైనా అద్దె ఇంట్లోకి దిగినా, దాదాపుగా గోడల్లో పగుళ్లు కనిపించక తప్పదని మీకు తెలుసు. అది పునాది స్థిరపడటం, ఉష్ణోగ్రత మార్పులు లేదా సాధారణ అరుగుదల వంటి అనేక కారణాల వల్ల అవి సంభవించవచ్చు. చిన్న పగుళ్లు పెద్ద విషయంగా అనిపించకపోయినా, గమనించకుండా వదిలేస్తే అవి త్వరగా పెద్దవిగానూ, ఖరీదైన సమస్యలుగానూ మారతాయి. అదృష్టవశాత్తూ, గోడలలో పగుళ్లను రిపేర్ చేయడం అనేది మిగతా వాటితో పోలిస్తే సులభమైన పని, దీనికి ఇంటి యజమానులకి కొంచెం అవగాహన ఉంటే, ఏ కొంచెమో గ్రీజు మీ మోచేతికి అంటించుకుంటే అంటించుకుంటారు గానీ సమస్యని మీరు పరిష్కరించగలుగుతారు. ఈ బ్లాగ్‌లో మనం వాల్ క్రాక్ రిపేర్ కి సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలను పరిశీలిద్దాం. మీరు ప్రారంభించడానికి అవసరమైన టూల్స్ ఏమిటో చెప్తాము. కాబట్టి మీ చొక్కా చేతుల్ని పైకి చుట్టండి, మీ స్పాకిల్‌ని పట్టుకోండి, పగుళ్లు పూడ్చేద్దాం!



గోడలలో పగుళ్లను ఎలా పూడ్చాలి?



1) డ్రైవాల్ లో పగుళ్లను మరమ్మతు చేయడం

డ్రైవాల్ అనేది జిప్సం ప్లాస్టర్‌తో తయారు చేయబడిన ఒక నిర్దిష్ట రకం వాల్ ప్యానెల్ రెండు కాగితపు షీట్‌ల మధ్య శాండ్‌విచ్ చేయబడింది, ఇది చాలా గృహాలు భవనాలలో అంతర్గత గోడలకు సాధారణంగా ఉపయోగించే పదార్థం. ఇంటి యజమానులు తమ డ్రైవాల్ లో ఎప్పుడో ఒకప్పుడు పగుళ్లు చూస్తూనే ఉంటారు కాబట్టి గోడలలో పగుళ్లని ఎలా పూడ్చాలనే విషయం చర్చిస్తున్నప్పుడు, చాలా మందికి పెద్ద ఆశ్చర్యం కలిగించదు. అదృష్టవశాత్తూ, డ్రైవాల్ లో చిన్న పగుళ్లను పూడ్చడం చాలా సులభమైన ప్రక్రియ.

డ్రైవాల్ పగుళ్లను సరిచేయడానికి క్రింది దశలు ఉన్నాయి:

 

    1) ప్రీమిక్స్ చేయబడిన లేదా 'సెట్టింగ్-టైప్'గా ఉండే జాయింట్ కాంపౌండ్ ని కొనుగోలు చేయండి

    2) మీరు పరిష్కరించాలనుకుంటున్న పగుళ్లతో పాటు V-నాచ్‌ను కత్తిరించండి

    3) శిధిలాలు లేదా ధూళిని తొలగించడానికి పగులు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి

    4) పగుళ్లకు ఒక పలుచని డాయింట్ కాంపౌండ్ ని అప్లై చేయండి, దానిని సమానంగా విస్తరింపజేయండి

    5) మీకు అవసరమైనన్ని సార్లు కోటింగ్ వేయండి

    6) కనీసం 24 గంటలు పొడిగా ఉండనివ్వండి

    7) ఆరిన తర్వాత, ఏవైనా గరుకు మచ్చలు లేదా అదనపు కాంపౌండ్ ఉండిపోతే ఆ ప్రాంతాన్ని నున్నగా లేదా పొడిగా చేయడానికి శాండ్ పేపర్ ని ఉపయోగించండి

    8) చుట్టుపక్కల గోడకు సరిపోయేలా ప్రాంతంపై పెయింటింగ్ చేయడం ద్వారా ముగించండి

     

2) కాంక్రీట్ గోడలో పగుళ్లను మరమ్మతు చేయడం

కాంక్రీట్ గోడలు తరచుగా బేస్‌మెంట్లు, గ్యారేజీలు, ఇంకా ఇంటిలోని ఇతర ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ గోడలలో పునాది, ఉష్ణోగ్రత మార్పులు లేదా నీటి నష్టం వంటి అనేక కారణాల వల్ల పగుళ్లు సంభవించవచ్చు. అదృష్టవశాత్తూ, కాంక్రీట్ గోడలో పగుళ్లను సరిచేసే ప్రక్రియల్లో మిగతా వాటితో పోల్చుకుంటే కాంక్రీట్ క్యూరింగ్ కూడా చాలా సులభమైన ప్రక్రియ.br>

కాంక్రీట్ గోడలో పగుళ్లను సరిచేయడానికి ఇక్కడ కొన్ని దశలను అనుసరించవచ్చు:

 

1) ఉలి లేదా సుత్తితో పగుళ్లను కొద్దిగా పెద్దవిగా చేయాలి.

2) ఏదైనా లూజుగా ఉన్న చెత్తను తొలగించడానికి ఒక వైర్ బ్రష్‌తో పగులు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి

3) 3) పాత పెయింట్ బ్రష్‌తో పగులు ప్రాంతాన్ని ప్రైమ్ చేయడానికి ఒక బాండింగ్ అడ్హెసివ్ ని ఉపయోగించండి

4)4) కాంక్రీట్ ప్యాచింగ్ ఎక్కువ కోటింగ్‌లను పుట్టీ కత్తితో పగులులోకి నొక్కుతూ దానిని సమానంగా చేయండి
మిగతా గోడతో

5) మరమ్మత్తు గోడలోని మిగిలిన భాగాలతో సరిపోలుస్తూ ముగించండి

 

 

3) ప్లాస్టర్ వాల్‌లో పగుళ్లను సరిచేయడం

ప్లాస్టర్ గోడలు తరచుగా పాత గృహాలూ, భవనాలలో కనిపిస్తాయి. ఈ గోడలలో పగుళ్లు పునాది, ఉష్ణోగ్రత మార్పులు లేదా ప్లాస్టర్ సహజంగా పాతబడడంతో సహా వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. ప్లాస్టర్ గోడలో పగుళ్లను సరిచేయడానికి డ్రైవాల్ లేదా కాంక్రీటు కంటే కొంచెం భిన్నమైన విధానం అవసరం, అయితే అది అప్పటికీ మేనేజ్ చేయగలిగే DIY ప్రాజెక్ట్.

ప్లాస్టర్ గోడను మరమ్మతు చేసేటప్పుడు అనుసరించాల్సిన కొన్ని దశలు ఇక్కడ ఉన్నాయి:

 

1) ప్లాస్టర్ కదులుతుందా లేదా విడిపోతుందా అని చూడటానికి గోడపై సున్నితంగా నొక్కుతూ ఉండండి

2) ప్రాంతాన్ని శుభ్రపరచండి. పుట్టీ కత్తిని ఉపయోగించి పగుళ్లను పెద్దవి చేయండి.

3) పగులుపై రెడీ మిక్స్డ్ ని స్ప్రెడ్ చేయండి లేదా సెట్టింగ్ టైప్ జాయింట్ కాంపౌండ్‌ను అప్లై చేయండి, దానిని పూర్తిగా నింపండి.

4) పగుళ్లు పెద్దగా ఉంటే దాని పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ప్లాస్టర్‌కు ముందు సెల్ఫ్-అడ్హెసివ్ ఫైబర్‌గ్లాస్ మెష్ టేప్ ని తప్పనిసరిగా అప్లై చేయాలి.

5) టేప్ చేయబడిన ప్రదేశంలో కాంపౌండ్ కి చెందిన కొన్ని పొరలను (బహుశా 2 లేదా 3) వేయండి

66) చివరగా మిగిలిన గోడకు సరిపోయేలా పాచ్ చేసిన ప్రదేశంలో పెయింట్ చేయండి

 

 

ఇది కూడా చదవండి: నీటి సిమెంట్ నిష్పత్తిని ఎలా లెక్కించాలి?




మొత్తానికి చెప్పుకోవలసిందేమంటే, గోడలలో పగుళ్లు డ్రైవాల్, కాంక్రీటు లేదా ప్లాస్టర్ గోడలలో సంభవించే ఒక సాధారణ సమస్య. అయినా గానీ, సరైన టూల్స్, సామగ్రితో, గోడలలో పగుళ్లను పూడ్చడం అనేది ఇంటి యజమానులకు సమయాన్నీ, డబ్బునీ ఆదా చేసే ఒక మేనేజ్ చేయగలిగే DIY ప్రాజెక్ట్ అవుతుంది. కొంచెం ఓపిక, శ్రమతో గోడలలో పగుళ్లను నివారించడానికి ఈ చిట్కాలను ఉపయోగించవచ్చు, మీరు మీ గోడల పగుళ్లను సరిచేయవచ్చు మీ ఇంటిని చాలా బాగా చూసుకోవచ్చు.



సంబంధిత కథనాలు


గోడలలో తేమ, దాన్నించి మీ గోడలను ఎలా నిరోధించవచ్చు

గోడలలో తేమ: రకాలు, కారణాలు మరియు నివారణ | అల్ట్రాటెక్

గోడలలో తేమ తీవ్రమైన నిర్మాణ నష్టాన్ని కలిగిస్తుంది, అలాగే ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది. మా గైడ్‌ని చదవడం ద్వారా గోడలలో నీరు రాకుండా ఎలా నిరోధించాలో అర్థం చేసుకోండి.

బేస్‌మెంట్ వాటర్‌ఫ్రూఫింగ్ మెథడ్స్: ఎ కంప్లీట్ గైడ్ | అల్ట్రాటెక్

బేస్‌మెంట్ వాటర్‌ఫ్రూఫింగ్ మెథడ్స్: ఎ కంప్లీట్ గైడ్ | అల్ట్రాటెక్

నీటి వల్ల కలిగే నష్టం, ఇంకా దాని వల్ల మచ్చలు, ఫంగస్ పెరుగుదల వంటి ఇతర ఖరీదైన సమస్యలను నివారించడానికి బేస్‌మెంట్ వాటర్‌ఫ్రూఫింగ్ అవసరం. బయటి (ఎక్స్టీరియర్), లోపలి (ఇంటీరియర్) బేస్‌మెంట్ వాటర్‌ఫ్రూఫింగ్ గురించి మరింత తెలుసుకోండి.

15 రకాల సిమెంట్: ఉపయోగాలు వివిధ గ్రేడ్‌లు | అల్ట్రాటెక్

15 రకాల సిమెంట్: ఉపయోగాలు వివిధ గ్రేడ్‌లు

మీ ఇంటికి సరిపోయే వివిధ రకాల సిమెంట్‌లను అర్థం చేసుకోండి. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఈ సమాచారాన్ని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడానికి ముందుగా వాటికి గల సాధారణ ఉపయోగాలూ, గ్రేడ్‌లను తెలుసుకోండి.


వీడియోలను సిఫార్సు చేయండి





గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....